సమ్మక్కను దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ గవర్నర్‌లు

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్‌లు ఇవాళ మేడారంలో పర్యటించారు. వీరిద్దరూ కలిసి వెళ్లి గద్దెపై ఉన్న సమక్కను దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రులు ఇంద్రకరన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రెడ్డిలు ఇరు రాష్ట్రాల గవర్నర్‌లను సాధరంగా స్వాగతం పలికి, దగ్గరుండి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సమ్మెక్కకు చీరెను సారిగా పెట్టి, బంగారాన్ని(బెళ్లం)ను ప్రసాదంగా నివేదించారు. కాగా ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా మేడారం జాతరను […]

సమ్మక్కను దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ గవర్నర్‌లు
Follow us

| Edited By:

Updated on: Feb 07, 2020 | 10:53 AM

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్‌లు ఇవాళ మేడారంలో పర్యటించారు. వీరిద్దరూ కలిసి వెళ్లి గద్దెపై ఉన్న సమక్కను దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రులు ఇంద్రకరన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రెడ్డిలు ఇరు రాష్ట్రాల గవర్నర్‌లను సాధరంగా స్వాగతం పలికి, దగ్గరుండి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సమ్మెక్కకు చీరెను సారిగా పెట్టి, బంగారాన్ని(బెళ్లం)ను ప్రసాదంగా నివేదించారు. కాగా ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా మేడారం జాతరను సందర్శించనున్నారు.

కాగా.. మేడారం జాతరలో భాగంగా.. గురువారం సమ్మక్క గద్దె చేరుకుంది. ఇప్పటికే మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఈ రోజు భక్తులు భారీ స్థాయిలో వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. బెల్లంను నిలువెత్తు బంగారంలా సమర్పిస్తున్నారు. రెండేళ్లకోసారి మేడారం జాతర జరగడంతో.. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్రప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది.