గోల్డెన్ గాళ్ హిమదాస్.. చిరుతలా దూసుకుపోతోంది..!

ఒకప్పుడు పరుగే రాదని ఆమెని ఎగతాళి చేశారు. కాని.. ఇప్పుడు చిరుతలా దూసుకుపోతోంది. చెప్పులు కూడా లేకుండా పరుగెత్తింది. ఓ రైతు కుటుంబంలో పుట్టి.. కష్టానికి మారు పేరుగా మారింది. అలాంటి అమ్మాయి ఇప్పుడు ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ షూ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయింది. దేశానికి స్పూర్తిగా నిలిచింది. ఆమే ఇండియా స్టార్ ప్రపంచ ఆథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళ అథ్లెట్ హిమదాస్.. అంతర్జాతీయ ట్రాక్ మీద పరుగులు మొదలుపెట్టిన తరువాత […]

గోల్డెన్ గాళ్ హిమదాస్.. చిరుతలా దూసుకుపోతోంది..!
Follow us

| Edited By:

Updated on: Jul 22, 2019 | 11:14 AM

ఒకప్పుడు పరుగే రాదని ఆమెని ఎగతాళి చేశారు. కాని.. ఇప్పుడు చిరుతలా దూసుకుపోతోంది. చెప్పులు కూడా లేకుండా పరుగెత్తింది. ఓ రైతు కుటుంబంలో పుట్టి.. కష్టానికి మారు పేరుగా మారింది. అలాంటి అమ్మాయి ఇప్పుడు ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ షూ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయింది. దేశానికి స్పూర్తిగా నిలిచింది. ఆమే ఇండియా స్టార్ ప్రపంచ ఆథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళ అథ్లెట్ హిమదాస్.. అంతర్జాతీయ ట్రాక్ మీద పరుగులు మొదలుపెట్టిన తరువాత కేవలం 18 రోజుల్లోనే మొదటి గోల్డ్ మెడల్ సాధించింది.

కేవలం 20 రోజుల వ్యవధిలో ఐదు ఈవెంట్లలో వరుసగా విజేతగా నిలిచి.. ఐదు గోల్డ్ మెడల్స్ సొంతం చేసుకుంది. క్లాడో అథ్లెటిక్ మీట్, కుంటో అథ్లెటిక్ మీట్, పోజ్నన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్, టబోర్ అథ్లెటిక్స్ మీట్, నోవె మెట్రో నాడ్ మెటుజి గ్రాండ్ ప్రిక్స్‌లో బంగారు పతకం గెల్చుకుంది హిమదాస్. హిమదాస్ అద్భుత ప్రదర్శనకు చెక్ రిపబ్లిక్ వేదికగా నిలిచింది. అయితే సెప్టెంబర్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్‌లో ఆర్హత సాధించే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. అర్హత ప్రమాణం అయిన 51.8 సెకన్లలో ఆమె లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. సీజన్ బెస్ట్ 52.09 సెకన్లతో రేసు పూర్తి చేసి టాప్‌‌లో నిలిచింది. 2018 ఏషియన్ గేమ్స్ లో 2 గోల్డ్, ఒక సిల్వర్ మెడల్ తో ప్రతిభ చాటింది హిమదాస్. వరల్డ్ అండర్ 20 ఛాంపియన్ షిప్ లోనూ బంగారు పతకం సాధించింది. యునిసెఫ్ కు మొట్టమొదటి యూత్ అంబాసిడర్ గా ఎంపికై హిమదాస్ ఇప్పటికే రికార్డులకెక్కింది. అస్సాం స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్ గానూ కొనసాగుతోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి తనకు వచ్చే వేతనంలో సగం మొత్తాన్ని హిమదాస్.. అస్సాం వరద సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. అస్సాంకు సాయపడాలని కోరారు.

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..