Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

TDP Praja Chytanya Yatra: టీడీపీ ప్రజా చైతన్య యాత్రలో హైలైట్ అంశాలివే

తొమ్మిది నెలల జగన్ ప్రభుత్వంలో తొమ్మిదేసి చొప్పున భారాలను, రద్దులను, మోసాలను ఎంచుకున్న తెలుగుదేశం పార్టీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ప్రజా చైతన్య యాత్రలో వాటిని ఎండగట్టాలని నిర్ణయించింది. వాటి వివరాలను టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు వెల్లడించారు.
highlights of praja chytanya yatra, TDP Praja Chytanya Yatra: టీడీపీ ప్రజా చైతన్య యాత్రలో హైలైట్ అంశాలివే

TDP Praja Chytanya Yatra from February 19th onwards across the state:  తొమ్మిది నెలల జగన్ పరిపాలనలో తొమ్మిది మోసాలంటూ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు తెలుగుదేశం పార్టీ తుది మెరుగులు దిద్దితోంది. తొమ్మిది నెలలు.. తొమ్మిది మోసాలు.. తొమ్మిది రద్దులు.. తొమ్మిది భారాలు అంటూ ఎజెండా సిద్దం చేసి రంగంలోకి దిగుతోంది విపక్ష తెలుగుదేశం పార్టీ.

బుధవారం నుంచి ఏపీ వ్యాప్తంగా ప్రారంభం కానున్న టీడీపీ ప్రజా చైతన్య యాత్రకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మంగళవారం విడుదల చేశారు. రేపటి నుంచి టీడీపీ ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభం అవుతున్నాయని ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరగనున్న యాత్రల్లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ప్రజలను భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 45 రోజుల పాటు కొనసాగనున్న ప్రజా చైతన్య యాత్రలను బుధవారం ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించనున్నారు.

Also read: Purandeshwari strong warning to political opponents on wrong propaganda

ఈ యాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని, పెన్షన్లు, రేషన్ కార్డుల రద్దుపై పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ నేతలంటున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తుగ్లక్ చర్యగా అభివర్ణిస్తున్న టీడీపీ నేతలు.. ఆ అంశాన్ని కూడా ప్రజా చైతన్య యాత్రలో ఎండగట్టనున్నారు.

Related Tags