Breaking News
  • ఢిల్లీ: మరో క్రీడా ఈవెంట్‌పై కరోనా ప్రభావం. మార్చి నుంచి జరగాల్సిన షూటింగ్‌ ప్రపంచకప్‌ రద్దు. అంతర్జాతీయ షూటింగ్‌ స్పోర్ట్ సమాఖ్య, భారత షూటింగ్ సంఘం నిర్ణయం.
  • హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌ ఎన్టీఆర్‌ గార్డెన్‌ దగ్గర కారు బీభత్సం. డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా, యువకుడికి గాయాలు. కారులో ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం. యువకుడిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు. కారులో మద్యం బాటిల్‌ లభ్యం. కేసు నమోదు చేసిన సైఫాబాద్‌ పోలీసులు.
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 32కు చేరిన కరోనా కేసులు. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట పరిధిలో 12 హాట్‌స్పాట్స్. లాక్‌డౌన్‌ను కఠినతరం చేసిన పోలీసులు. వేర్వేరు దేశాల నుంచి ట్రావెల్ చేసిన.. 814 మందికి 14 రోజుల క్వారంటైన్‌ పూర్తి. ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లలో 246 మంది అనుమానితులు. ఎంజీఎంలోని ఐసోలేషన్‌ వార్డులో 11 మంది అనుమానితులు.
  • కరోనా కట్టడి కోసం పీఎం కేర్స్‌కు భారీగా విరాళాలు. పీఎం కేర్స్‌కు రూ.52 కోట్ల విరాళం ఇచ్చిన 12 ప్రధాననౌకాశ్రయాలు.. షిప్పింగ్ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థలు.
  • ఏపీలో కరోనా పరీక్షా కేంద్రాల సామర్థ్యం పెంపు. విశాఖ, గుంటూరు, కడపలో కరోనా పరీక్షా కేంద్రాల సామర్థ్యం పెంపు. ప్రాథమిక స్థాయిలోనూ పరీక్షల నిర్వహణకు అనుమతులు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి 240 పరికరాలు. కొవిడ్‌-19పై సమీక్షలో సీఎం జగన్‌ వెల్లడి.

అల్లు అర్జున్ ఆఫీసు అదుర్స్.. హైలైట్ ఏంటంటే?

Allu Arjun moved out of Geetha Arts Office, అల్లు అర్జున్ ఆఫీసు అదుర్స్.. హైలైట్ ఏంటంటే?

అల్లు అర్జున్ తన కొత్త ఆఫీసును ఓ రేంజ్ లో నిర్మిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్‌లో నిర్మిస్తున్న తన కొత్త కార్యాలయానికి బన్నీ భారీగా ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. లుక్ పరంగా కార్పొరేట్ ఆఫీసును తలదన్నేలా ఈ ఆఫీస్ ఉండబోతుందని, దానికోసం కాస్ట్లీ ఇంటీరియర్స్, డెకార్స్ వాడుతున్నట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోకి ఇంత పెద్ద ఆఫీస్ ఉండటం ఇదే మొదటిసారి. ఎంతో మంది ఫ్యాన్స్ ఇంకా విజిటర్స్ కూర్చునేందుకు ఇది వీలును కల్పిస్తుంది. అంతే కాదు, తన అభిమానులతో సంభాషించేందుకు వీలుగా ఒక పెద్ద హాల్ ను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ నిర్మిస్తున్నఈ భారీ కార్యాలయంలో అతని సినిమాలు ఇంకా గీతా ఆర్ట్స్ యాడ్స్ ప్రదర్శనకు ఉంచుతారు. ఇక ఈ కొత్త కార్యాలయంలో బ్రాండ్ సమావేశాలు ఇంకా ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు కూడా జరుగుతాయి. దీనికోసమే మొత్తం కార్యాలయం కార్పొరేట్ కార్యాలయం లాగా ఉండేలా ప్రణాళిక సిద్ధంచేస్తున్నారు.

ఇంతేకాదు.. అల్లు అర్జున్ కార్యాలయంలో ఒక ప్రత్యేక మీడియా గదిని కూడా కేటాయించారు, అక్కడ అతను మీడియా వారిని కలుసుకోవచ్చు.. ఇంటర్వ్యూలు, విలేకరుల సమావేశాలు కూడా నిర్వహించవచ్చు. ఇక ఈ ఆఫీస్ పార్కింగ్ ఏరియా కూడా భారీగా ఉంటుందని సమాచారం.. ఎక్కువ సంఖ్యలో కార్లు, బైక్‌లను ఉంచేందుకు వీలును కల్పిస్తున్నారు. మొత్తానికి, తన ఫాల్కన్ కారవాన్‌తో వార్తల్లో నిలిచిన బన్నీ.. తరువాత కొత్త ఇళ్లు, తరువాత కొత్త ఆఫీస్‌తో మరోసారి హాట్ న్యూస్ గా మారాడు.

Allu Arjun moved out of Geetha Arts Office, అల్లు అర్జున్ ఆఫీసు అదుర్స్.. హైలైట్ ఏంటంటే?

Related Tags