భూమ్మీద నమోదైన అత్యధిక రికార్డు ఉష్ణోగ్రత

అమెరికాలోని కాలిఫోర్నియా- నెవాడా మధ్య ప్రాంతంలో ఏటా 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు మించే ఉష్టోగ్రతలు నమోదవుతాయి.. ఇక ఇప్పుడేమో ఏకంగా రికార్డును బద్దలు కొట్టేసిందా ప్రాంతం! మొన్న భానువారం రోజున భానుడు భగభగమన్నాడక్కడ! అందుకే 54.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.. భూమ్మీద ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు..

భూమ్మీద నమోదైన అత్యధిక రికార్డు ఉష్ణోగ్రత
Follow us

|

Updated on: Aug 18, 2020 | 12:35 PM

గ్రీష్మంలో బిక్కచచ్చిపోతుంటాం! మండు వేసవిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతకే ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం! ఇక 50 డిగ్రీలు దాటిందంటే చచ్చి ఊరుకుంటాం! అసలు ఈ భూమ్మీద 50 డిగ్రీలకు మించిన ఉష్ణోగ్రత ఎక్కడైనా ఉందా? అంటే ఉంది..! అమెరికాలోని కాలిఫోర్నియా- నెవాడా మధ్య ప్రాంతంలో ఏటా 50 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు మించే ఉష్టోగ్రతలు నమోదవుతాయి.. ఇక ఇప్పుడేమో ఏకంగా రికార్డును బద్దలు కొట్టేసిందా ప్రాంతం! మొన్న భానువారం రోజున భానుడు భగభగమన్నాడక్కడ! అందుకే 54.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.. భూమ్మీద ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు.. అసలు ఆ ప్రాంతం పేరే మృత్యులోయ! ఇంగ్లీషులో చెప్పాలంటే డెత్‌ వ్యాలీ.. భరించలేనంత వేడి… చుర్రుమనిపించే ఎండ అక్కడ ఉంటుంది.. మనుషులు నివాసం ఉండే చోటు కాదిది.. అంత దుర్భరపరిస్థితులు ఉంటాయిక్కడ. అమెరికాలోని బంగారు నిక్షేపాలను వెతికే పనిలో చాలా మంది ఈ లోయ నుంచే వెళ్లారు.. అలా వచ్చినవారిలో చాలా మంది ఇక్కడి వేడి తట్టుకోలేక చచ్చిపోయారు.. అందుకే దీనిని మృత్యులోయ అనేది! సుమారు వందేళ్ల కిందట… సరిగ్గా చెప్పాలంటే 1913, జులై 10న ఇక్కడ 56.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్టోగ్రత నమోదయ్యిందట! కాకపోతే దీన్ని నమ్మేవారు చాలా తక్కువ.. ఎందుకంటే ఆ రోజుల్లో ఉష్ణోగ్రతలను కొలిచేందుకు అధునాతనమైన పరికరాలు లేవు.. అలాగే 1931లో ట్యునీషియాలో కూడా 55 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. 1922లో సహారా ఎడారిలో నమోదైన 58 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తూచ్‌ అని కొట్టిపారేశారు.. ఇప్పుడు నమోదైన 54.4 డిగ్రీల ఉష్ణోగ్రతే రికార్డని రికార్డేసి మరీ చెబుతున్నారు శాస్త్రవేత్తలు.. అంచేత మనం కూడా నమ్మి తీరాలి.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?