ఉప్పొంగుతోన్న నాగార్జున సాగర్ డ్యాం

నల్గొండ జిల్లాలో ఉన్న చారిత్రక నాగార్జున సాగర్ డ్యామ్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సాగర్ లోకి వరదనీరుపోటెత్తుతోంది. దీంతో శనివారం ఉదయం 18 క్రస్ట్ గేట్స్ 15 ఫీట్ల మేర ఎత్తి 3,86,544 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, ఇన్ ఫ్లో 4,34,904 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 4,23,504 క్యూసెక్కులు గా ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు అయితే, ప్రస్తుత నీటి […]

ఉప్పొంగుతోన్న నాగార్జున సాగర్ డ్యాం
Follow us

|

Updated on: Oct 17, 2020 | 8:49 AM

నల్గొండ జిల్లాలో ఉన్న చారిత్రక నాగార్జున సాగర్ డ్యామ్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సాగర్ లోకి వరదనీరుపోటెత్తుతోంది. దీంతో శనివారం ఉదయం 18 క్రస్ట్ గేట్స్ 15 ఫీట్ల మేర ఎత్తి 3,86,544 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, ఇన్ ఫ్లో 4,34,904 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 4,23,504 క్యూసెక్కులు గా ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ: 312.0405 టీఎంసీలు అయితే, ప్రస్తుత నీటి నిల్వ : 308.0507 టీఎంసీలుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులుకాగా, ప్రస్తుత నీటిమట్టం: 588.80 అడుగులు గా నమోదైంది.