రాజధానిపై హైపవర్ కమిటీ అనూహ్య నిర్ణయం

ఏపీ రాజధానిపై అధ్యయనం చేస్తున్న హైపవర్ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడు కమిటీలిచ్చిన నివేదికలను అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ సోమవారం మరోసారి సమావేశమైంది. తొలి సమావేశంలో బోస్టన్ గ్రూపు, జీఎన్ రావు కమిటీలిచ్చిన నివేదికలపై చర్చించిన హైపవర్ కమిటీ.. రెండో సమావేశంలో అమరావతి ఏరియా ప్రజల సమస్యలను, వారి అపోహలను చర్చించింది. సోమవారం మూడో దఫా సమావేశమైన హైపవర్ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రజలు.. మరీ ముఖ్యంగా […]

రాజధానిపై హైపవర్ కమిటీ అనూహ్య నిర్ణయం
Follow us

|

Updated on: Jan 13, 2020 | 1:03 PM

ఏపీ రాజధానిపై అధ్యయనం చేస్తున్న హైపవర్ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడు కమిటీలిచ్చిన నివేదికలను అధ్యయనం చేసిన హైపవర్ కమిటీ సోమవారం మరోసారి సమావేశమైంది. తొలి సమావేశంలో బోస్టన్ గ్రూపు, జీఎన్ రావు కమిటీలిచ్చిన నివేదికలపై చర్చించిన హైపవర్ కమిటీ.. రెండో సమావేశంలో అమరావతి ఏరియా ప్రజల సమస్యలను, వారి అపోహలను చర్చించింది. సోమవారం మూడో దఫా సమావేశమైన హైపవర్ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది.

అమరావతి రాజధాని ప్రాంతంలోని ప్రజలు.. మరీ ముఖ్యంగా రైతాంగం తాము భూములను త్యాగం చేసి నష్టపోయామని భావిస్తున్న నేపథ్యంలో వారి ఆందోళనకు రాజకీయ పార్టీల వ్యూహాలు తోడయ్యాయి. తాము రాజధాని కోసం భూములిస్తే.. ఇప్పుడు రాజధానినే తరలిస్తే తాము అటు భూములు కోల్పోయి… ఇటు రాజధాని కోల్పోయి రెంటికి చెడ్డ రేవడిగా మారతామని అమరావాతి ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో అమరావతి ఏరియా ప్రజల అభిప్రాయాలను సేకరించాలని హైపవర్ కమిటీ సోమవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈనెల 17వ తేదీ సాయంత్రం వరకు అమరావతి ఏరియా ప్రజలు హైపవర్ కమిటీకి తమ అభిప్రాయాలను తెలపవచ్చని రాష్ట్ర మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితిలో అమరావతి ఏరియా ప్రజలకు అన్యాయం చేయాలని ఎందుకు కోరుకుంటుందని నాని ప్రశ్నించారు.

అందుకే అమరావతి ఏరియా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని, వారికి సంపూర్ణ న్యాయం చేయాలన్నదే హైపవర్ కమిటీ అభిప్రాయమని, దానికి కోసమే ఈనెల 17వ తేదీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతామని పేర్ని నాని తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాలను సీఆర్డీఏ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా గానీ, ఆల్ లైన్ ద్వారా గానీ తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని మంత్రి వివరించారు. ప్రభుత్వానికి కూడా తమ అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా తెలియజేయవచ్చన్నారు నాని. ఈనెల 17న సాయంత్ర హైపవర్ కమిటీ మరోసారి సమావేశమవుతుందని చెప్పారాయన.