Breaking News
  • దేశవ్యాప్తంగా దీపయజ్ఞం. ప్రధాని మోదీ పిలుపు మేరకు దీపాలు వెలిగించిన దేశ ప్రజలు. దీపం వెలిగించిన రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు. దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా వెలుగొందిన భారత్‌. తెలుగు రాష్ట్రాల్లో దీపాల కాంతులు. ప్రగతి భవన్‌లో దీపాలు వెలిగించిన సీఎం కేసీఆర్‌. తాడేపల్లిలోని తన నివాసంలో దీపాలు వెలిగించిన ఏపీ సీఎం జగన్‌. దీపాలు వెలిగించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌లు తమిళిసై, భిశ్వభూషణ్. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. అత్యవసరసేవలు అందిస్తున్న వైద్యులు, పోలీసులు.. పారిశుద్ధ్య సిబ్బందికి దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపిన ప్రజలు.
  • 130 కోట్ల ప్రజల మహాశక్తిని చాటిన భారతీయులు. దీప యజ్ఞంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు. కుటుంబ సమేతంగా దీపం వెలిగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తన నివాసంలో దీపాలు వెలిగించిన ప్రధాని మోదీ. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన కేంద్ర మంత్రులు, ఎంపీలు.
  • ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ ఫోన్‌. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 20 కోట్ల గన్నీ బ్యాగ్‌లు అవసరం. ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌. గన్నీ బ్యాగ్‌లకు తీవ్ర కొరత ఉందని వివరించిన సీఎం కేసీఆర్‌. పశ్చిమబెంగాల్‌లో గన్నీ బ్యాగ్‌ల పరిశ్రమలు తెరిపించాలన్న కేసీఆర్‌. పరిశ్రమలు తెరిపిస్తేనే గన్నీ బ్యాగ్‌ల సమస్య తీరుతుందన్న కేసీఆర్‌. పశ్చిమ బెంగాల్‌ నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా గన్నీ బ్యాగ్‌లు.. తీసుకొచ్చేందుకు అనుమతించాలని ప్రధాని మోదీకి కేసీఆర్‌ విజ్ఞప్తి. సంబంధిత శాఖలతో మాట్లాడతానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.
  • ఒక్క తప్పుడు మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేసినా కేసులు బుక్‌ చేస్తాం. వెరిఫై చేయకుండా సోషల్‌ మీడియాలో వీడియోలు షేర్‌ చేయొద్దు. డిజిటల్‌గా వెదికి పట్టుకుని అరెస్ట్‌ చేస్తాం. నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన వారిలో ఎవరూ కావాలని.. కరోనా వ్యాప్తి చేశారనడానికి ఆధారాలు లేవు. -టీవీ9 ఎన్‌కౌంటర్‌ విత్‌ మురళీకృష్ణలో అంజనీకుమార్‌, సజ్జనార్‌.
  • కర్నూలులో కరోనా విజృంభణ. ఒకేరోజు 12 పాజిటివ్‌ కేసులు నమోదు. 12 మంది ఢిల్లీ సభలకు వెళ్లివచ్చిన వారే. కర్నూలులో మొత్తం 53 కరోనా కేసులు నమోదు. కాంటాక్ట్‌ కేసులపై దృష్టిపెట్టిన అధికారులు.

సంపాదనేమో కోట్లకు కోట్లు వేసేవేమో చిల్లరవేషాలు

Citigroup banker Paras Shah is likely to have been earning a seven-figure salar, సంపాదనేమో కోట్లకు కోట్లు వేసేవేమో చిల్లరవేషాలు

కొందరికి క్లెప్టమానియా అనే జబ్బుంటుంది… ఆ వ్యాధి ఉన్నవారికి ఏదో ఒకటి నొక్కేయాలనిపిస్తుంది… కోట్ల కొద్దీ సంపాదన ఉన్నా కక్కుర్తి పడేట్టు చేస్తుంది… మరి సిటీ గ్రూప్‌ బ్యాంక్‌లో సీనియర్‌ మేనేజర్‌గా పని చేస్తున్న పరాశ్‌ షాకు ఇలాంటి రోగముందో లేదో తెలియదు కానీ… అతగాడి చిలక్కొట్టుడు వ్యవహారం ఉద్యోగం ఊడేలా చేసింది.. సిటీ గ్రూప్‌ బ్యాంక్‌ అంటే మామూలు బ్యాంకు కాదు… యూరప్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలతో అత్యధిక లాభాలను ఆర్జిస్తున్న బ్యాంక్‌… అందులో సీనియర్‌ మేనేజర్‌ అంటే ఇంకా మామూలు విషయం కాదు… ఏటా తొమ్మిదిన్నర కోట్ల రూపాయల జీతం … అంత సంపాదన ఉన్న పరాశ్‌ షా చిల్లరవేషాలేయడమేమిటి..? అంటే ఖర్మ… ఇంతకీ ఇతగాడు ఏం చేసేవాడంటే లండన్‌లోని కానరీ వార్ఫ్‌లో ఉన్న బ్యాంక్‌ హెడ్‌ ఆఫీసు నుంచి తరచుగా ఫుడ్‌ను దొంగలించేవాడు.. చాలాసార్లు శాండ్‌విచ్‌లను చోరీ చేశాడు.. ఎంతకాలం నుంచి ఇలా చేస్తున్నాడో తెలియదు కానీ.. ఓ ఫైన్‌ మార్నింగ్‌ మేనేజ్‌మెంట్‌కు ఈ విషయం తెలిసిపోయింది… అంతే…ఇక ఇప్పటికి దుకాణం సర్దేసుకోబాబు అంటూ ఉద్యోగంలోంచి సస్పెండ్‌ చేశారు..
పరాశ్‌ షా లైఫ్‌ స్టయిల్‌ చూస్తే అబ్బో అనిపిస్తుంది.Citigroup banker Paras Shah is likely to have been earning a seven-figure salar, సంపాదనేమో కోట్లకు కోట్లు వేసేవేమో చిల్లరవేషాలు

హాలీడేస్‌లో ఫారిన్‌ టూర్లకు వెళ్లడం ఇతగాడి హాబీ… పెరూలోని మాచుపిచ్చు దగ్గర దిగిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టుకున్నాడు కూడా! లండన్‌లోని ఎడ్మాంటన్‌ గ్రామర్‌ స్కూల్‌లో చదివిన పరాశ్‌ షా తర్వాత బాత్‌ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్నాడు. హెచ్‌ఎస్‌బీసీలో ఇన్‌కమ్‌ ట్రేడింగ్‌ బిజినెస్‌లో ఏడేళ్లపాటు పని చేశాడు.. మూడేళ్ల కిందట సిటీ గ్రూప్‌లో చేరాడు.. ఇంత టాప్ పొజిషన్‌లో ఉన్న పరాశ్‌ శాండ్‌విచ్‌లకు కక్కుర్తి పడటమేమిటన్న డౌటానుమానం చాలా మంది వస్తుంది…ఇతడే కాదు… టాప్‌ పొజిషన్‌లో ఉన్న చాలా మందికి ఇలాంటి వింత జబ్బు ఉంటుంది… ఇలా చేతి దురద ఉన్న ఓ లండన్‌ బ్యాంకర్‌ తన ఫ్రెండ్‌ బైక్‌ నుంచి 5 వందల రూపాయలు కూడా చేయని ఓ పార్ట్‌ను దొంగలించాడు… ఇది తెలుసుకున్న జపాన్‌కు చెందిన ముజువో బ్యాంక్‌ ఉన్నపళంగా అతడిని ఉద్యోగం నుంచి తీసేసింది… ఇతను నయం … బ్లాక్‌రాక్‌ ఎగ్జిక్యూటివ్‌ జోనాధన్‌ బుర్రోస్‌ది అయితే మరీ పిసినారితనం… రైల్లో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తూ అడ్డంగా దొరికిపోయాడు.. ఇంటా బయటా బోల్డన్ని విమర్శలు.. వెక్కిరింతలు రావడంతో ఓ 39 లక్షల రూపాయలు వదిలించుకుని బ్రిటన్‌ ఆగ్నేయ రైల్వేతో రాజీ కుదుర్చుకున్నాడు.. అయినా పడిన మచ్చ అయితే చెరిగిపోదుగా…!

Related Tags