Breaking News
  • నెల్లూరు: సైదాపురం తహశీల్దార్‌ చంద్రశేఖర్‌ సస్పెన్షన్‌. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో చంద్రశేఖర్‌తో పాటు.. వీఆర్‌వోతో, తహశీల్దార్‌ ఆఫీస్‌ ఉద్యోగిని సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌.
  • టీవీ9కు అవార్డుల పంట. ఎక్సేంజ్‌ ఫర్‌ మీడియా న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అవార్డుల్లో.. టీవీ9కు మూడు అవార్డులు. పుల్వామా దాడి కవరేజ్‌కు బెస్ట్ న్యూస్ కవరేజ్ అవార్డు అందుకున్న.. విజయవాడ బ్యూరో చీఫ్‌ హసీనా. మరో రెండు విభాగాల్లో టీవీ9కు అవార్డులు. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ కార్యక్రమానికి.. సౌత్‌ ఇండియాలోనే బెస్ట్‌ యాంకర్‌గా రజినీకాంత్‌కు అవార్డు. టీవీ9 టాస్క్‌ఫోర్స్‌ బ్లాక్‌మ్యాజిక్‌ కార్యక్రమానికి మరో అవార్డు. అద్రాస్‌పల్లిలోని 'చితిపై మరో చితి' బాణామతి కథనానికి.. బెస్ట్‌ లేట్‌ ప్రైమ్‌టైం షో అవార్డు.
  • కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన కేంద్రం. స్థానికుల ప్రయోజనాలను కాపాడుతామని హామీ. త్వరలో ప్రత్యేక హోదా స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తాం -కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌.
  • రామానాయుడు స్టూడియోలో ప్రెషర్‌ కుక్కర్‌ సినిమా చూసిన కేటీఆర్‌. ప్రెష్‌ ఎనర్జీ, మంచి మెసేజ్‌తో సినిమా ఉంది. డాలర్‌ డ్రీమ్స్‌ కోసం అందరూ అమెరికాకు పరుగులు పెడుతున్నారు. కథలోని కంటెంట్‌ను అందరికీ అర్ధమయ్యేలా సినిమా తీశారు-మంత్రి కేటీఆర్‌.
  • తూ.గో: కోటనందూరు మండలం అప్పలరాజుపేటలో విద్యుత్‌షాక్‌తో మామిడి శ్రీను అనే వ్యక్తి మృతి.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 56,837 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు.

స్వస్థతతో రోగాలు నయమవుతాయంటూ.. చర్చిలో హైడ్రామా

, స్వస్థతతో రోగాలు నయమవుతాయంటూ.. చర్చిలో హైడ్రామా

స్వస్థతతో రోగాలు నయమవుతాయంటూ చర్చిలో జరిగిన హైడ్రామాకు జనవిజ్ఞాన వేదిక బ్రేక్ వేసింది. అది హైదరాబాద్ ఉప్పల్ కాంచివాని సింగారంలోని ఓ చర్చి. అక్కడ అమావాస్య, పౌర్ణమి రోజులలో దెయ్యాలను వదిలిస్తానంటూ… పాస్టర్ శాంసన్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి జబ్బునైనా.. స్వస్థతతో నయం చేస్తానంటూ బహిరంగ ప్రకటనలు గుప్పించాడు. హోలీ స్పిరిట్ ప్యారడైజ్ ఫైర్ చర్చి ప్రతినిధులు ఓపెన్ ఛాలెంజ్ చేయడంతో జనం భారీగా తరలివచ్చారు. తమను పట్టి పీడిస్తున్న పీడలను వదలించేస్తారని ఎంతో ఆశగా చర్చి దగ్గరకు చేరుకున్నారు. మంత్ర తంత్రాలతో స్వస్థత చేకూరుస్తామంటూ పాస్టర్ ప్రార్ధనలు చేశారు. ఆ సమయంలో డీజే సౌండ్లు, డప్పుల మోతల మధ్య బాధితులు ఊగిపోయారు. అయితే జరుగుతున్న ఈ తతంగాన్ని జన విజ్ఞాన వేదిక చెవిన పడ్డంతో.. ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్ బృందం సభ్యులు చర్చి దగ్గరకు చేరుకున్నారు. అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ నిర్వాహకుల్ని నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని.. పరిస్థితిని చక్కదిద్దారు.

మరోవైపు ఓపెన్ ఛాలెంజ్ చేసి తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంటే.. మధ్యలోనే అడ్డుపడ్డారని నిర్వాహకులు అంటున్నారు. తాము జబ్బుల్ని నయం చేస్తున్నామని ఓపెన్ ఛాలెంజ్ చేసినా.. దాన్ని పూర్తిగా చూడకుండానే మధ్యలోనే వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు.

అయితే పాస్టర్ వ్యాఖ్యల్ని జనవిజ్ఞాన వేదిక సభ్యులు, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్ బృందం సభ్యులు ఖండించారు. బాణామతి, చేతబడులు తగ్గిస్తామన్న చర్చ్ ప్రతినిధులు ఇక్కడకొచ్చిన వారిని హిప్నటైజ్ టెక్నిక్‌తో మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
మతం ముసుగులో చేస్తున్న ఇలాంటి మోసాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదంతా వీళ్లు కావాలనే చేస్తున్నారని.. ఎలాంటి నిజం లేదంటున్నారు జన విజ్ఞాన్ని వేదిక సభ్యులు రమేష్.

Related Tags