బ్రేకింగ్: మునిసిపల్ ఎన్నికలపై హైకోర్టుకు కాంగ్రెస్

తెలంగాణలో మొదలైన మునిసిపల్ ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. మునిసిపల్ ఎన్నికల వాయిదాకు ఎత్తులు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కనీసం నాలుగు వారాలపాటైనా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని హైకోర్టును కోరింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఈ నెల నాలుగున మునిసిపల్ ఎన్నికల రిజర్వేషన్లు వెల్లడి కానుండగా.. ఆ వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరి 22న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు జరిపేలా రాష్ట్ర ఎన్నికల […]

బ్రేకింగ్: మునిసిపల్ ఎన్నికలపై హైకోర్టుకు కాంగ్రెస్
Follow us

|

Updated on: Jan 01, 2020 | 5:36 PM

తెలంగాణలో మొదలైన మునిసిపల్ ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ వేయాలని కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. మునిసిపల్ ఎన్నికల వాయిదాకు ఎత్తులు మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కనీసం నాలుగు వారాలపాటైనా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని హైకోర్టును కోరింది కాంగ్రెస్ పార్టీ.

తెలంగాణలో ఈ నెల నాలుగున మునిసిపల్ ఎన్నికల రిజర్వేషన్లు వెల్లడి కానుండగా.. ఆ వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరి 22న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు జరిపేలా రాష్ట్ర ఎన్నికల అధికారి షెడ్యూల్‌ను పది రోజుల క్రితం వెల్లడించారు.

ఆ తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశం రసాబాసగా ముగిసింది. రిజర్వేషన్ల పరిశీలనకు సమయం కావాలని, అందుకోసం నోటిఫికేషన్‌ని మార్చి విడుదల చేయాలని అఖిలపక్షానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్ రావు ఎన్నికల అధికార నాగిరెడ్డిని కోరారు. అయితే, దానికి ఆయన ససేమిరా అనడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అఖిలపక్ష సమావేశం నుంచి వాకౌట్ చేశారు.

జరిగిన తంతును తెలుసుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. న్యాయపోరాటానికి సిద్దమయ్యారు. మునిసిపల్ ఎన్నికల రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాత నాలుగు వారాలు వాటిని పరిశీలించేందుకు సమయం అవసరం వుంటుందని, ఆ తర్వాతనే ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఉత్తమ్ ఆదేశాల మేరకు జంధ్యాల రవిశంకర్ హైకోర్టును ఆశ్రయించారు. జంధ్యాల రవిశంకర్, మరో సీనియర్ న్యాయవాది ప్రకాశ్ రెడ్డి కౌన్సిల్‌గా కాంగ్రెస్ పార్టీ వాదనలను హైకోర్టులో వినిపించనున్నారు. ఈ పిటీషన్‌ను హైదరాబాద్ హైకోర్టు బుధవారం పరిశీలించనుంది.

ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..