లీగల్ సమస్యల్లో స్టార్ హీరోయిన్ చిత్రం!

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది లేడి సూపర్ స్టార్ నయనతార. ఒకవైపు స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాలు చేస్తూ.. మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన దాదాపు అన్ని లేడి ఓరియెంటెడ్ సినిమాలు బాక్స్‌ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇటీవల ఆమె నటించిన ‘ఐరా’ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. తాజాగా ఆమె ‘కోలైయుతీర్ కోలాం’ అనే చిత్రంలో నటించింది. ‘కోలైయుతీర్ కోలాం’ […]

లీగల్ సమస్యల్లో స్టార్ హీరోయిన్ చిత్రం!
Follow us

|

Updated on: Jun 12, 2019 | 5:04 PM

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది లేడి సూపర్ స్టార్ నయనతార. ఒకవైపు స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాలు చేస్తూ.. మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన దాదాపు అన్ని లేడి ఓరియెంటెడ్ సినిమాలు బాక్స్‌ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇటీవల ఆమె నటించిన ‘ఐరా’ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. తాజాగా ఆమె ‘కోలైయుతీర్ కోలాం’ అనే చిత్రంలో నటించింది.

‘కోలైయుతీర్ కోలాం’ ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి లీగల్ సమస్యలు  చుట్టుముట్టాయి. దర్శకుడు చక్రి తోలేటి.. ఓ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే చక్రి తోలేటి.. తాను కొనుగోలు చేసిన నవల ఆధారంగానే సినిమా రూపొందించాడని మరో దర్శకుడు బాలాజీ కుమార్ హై‌కోర్ట్‌లో కేసు వేశాడు.

కేసు విచారణను స్వీకరించిన కోర్టు.. చిత్ర యూనిట్ సభ్యులైన దర్శకుడు, హీరోయిన్, నిర్మాతకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. ఈ నెల 21లోగా సమాధానం ఇవ్వాలని వారిని ఆదేశించింది. కాగా అప్పటివరకు ఈ సినిమా విడుదలకు స్టే విధించింది హైకోర్టు. మరి ఈ లీగల్ సమస్య నుంచి నయన్ అండ్ కో ఎలా బయటపడతారో వేచి చూడాలి.