బ్రేకింగ్: ఉల్లంఘిస్తే ఇక కేసులే.. హైకోర్టు వార్నింగ్

ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలను, నిబందనలను ఉల్లంఘించే వారు ఎవరైనా కేసులు నమోదు చేయాలని ఆదేశించింది అమరావతి హైకోర్టు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద...

బ్రేకింగ్: ఉల్లంఘిస్తే ఇక కేసులే.. హైకోర్టు వార్నింగ్
Follow us

|

Updated on: May 28, 2020 | 5:23 PM

AP High court directed police to file cases against those who breaks lock-down restrictions: ఏపీలో లాక్‌డౌన్ ఆంక్షలను, నిబందనలను ఉల్లంఘించే వారు ఎవరైనా కేసులు నమోదు చేయాలని ఆదేశించింది అమరావతి హైకోర్టు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయంటూ ప్రతీ ఒక్కరికీ సీరియస్ నెస్ వుండాలని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఏపీలో సాక్షాత్తు ప్రజాప్రతినిధులే లాక్ డౌన్ నిబంధనలను పాటించకపోవడం, ఆంక్షలను ఉల్లంఘించడం దాఖలైన ఫిర్యాదులపై హైకోర్టు ధర్మాసానం గురువారం విచారణ జరిపింది. వైసీపీకి చెందిన ఓ మంత్రితోపాటు ఏడుగురు ఎమ్మెల్యేలు లాక్ డౌన్ సమయంలో యధేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ హైకోర్టులో మొత్తం ఎనిమిది వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి.

గురువారం ఈ పిటిషన్లను విచారించిన.. ఏపీలో లాక్ డౌన్ ఉల్లంఘించిన ఎవరి మీదైనా కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడ్డారో.. వారి మీద డిజాస్టర్ మేనేజ్ మెంట్ వారికి ఫిర్యాదు చేయాలని పిటిషనర్‌లకు హైకోర్టు సూచించింది. ఫిర్యాదు తీసుకుని తద్వారా వారి మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ మొత్తం 8 మంది ఎమ్మెల్యేలపై హైకోర్టులో కిషోర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.