బాబుకు భద్రతపై సస్పెన్స్.. తీర్పును రిజర్వ్‌లో ఉంచిన కోర్టు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పుని కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రముఖుల భద్రతపై రివ్యూ చేసింది. అందులో భాగంగానే చంద్రబాబు, లోకేష్ సహా వారి కుటుంబ సభ్యుల భద్రతపై కోత విధించింది. అయితే.. చంద్రబాబుకు భద్రత తగ్గించడంపై టీడీపీ నేతలు కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు ఉన్న భద్రతను యథావిథిగా ఉంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. విచారణలో భాగంగా.. ప్రభుత్వం […]

బాబుకు భద్రతపై సస్పెన్స్.. తీర్పును రిజర్వ్‌లో ఉంచిన కోర్టు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 01, 2019 | 5:09 PM

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పుని కోర్టు రిజర్వ్‌లో ఉంచింది.

ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రముఖుల భద్రతపై రివ్యూ చేసింది. అందులో భాగంగానే చంద్రబాబు, లోకేష్ సహా వారి కుటుంబ సభ్యుల భద్రతపై కోత విధించింది. అయితే.. చంద్రబాబుకు భద్రత తగ్గించడంపై టీడీపీ నేతలు కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు ఉన్న భద్రతను యథావిథిగా ఉంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

విచారణలో భాగంగా.. ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించారు అడ్వొకేట్ జనరల్. చంద్రబాబుకు ఇవ్వాల్సినంత భద్రత ఇస్తున్నామని, ప్రస్తుతం ఆయనకు సెక్యూరిటీగా 74 మంది ఉంటున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో నివాసానికి కూడా భద్రత కల్పిస్తున్నామని కోర్టుకు చెప్పారు. మరోవైపు.. చంద్రబాబుకు మావోయిస్టులు, రెండ్ శాండల్ స్మగ్లర్స్ నుంచి ప్రాణహాని ఉందని.. భద్రత పెంచాలని వాదించారు చంద్రబాబు తరపు న్యాయవాది. రెండు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పుని రిజర్వ్‌లో ఉంచింది.