చంద్రబాబు భద్రతపై తదుపరి విచారణ 9కి వాయిదా

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు భద్రత తగ్గింపు విషయంపై హైకోర్టులో వాదనలు ముగిసాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేశారు. తాను మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నానని.. తనకు రాష్ట్రప్రభుత్వం తగ్గించిన భద్రతను పెంచాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. పాత భద్రతను పునరుద్ధరించాలంటూ సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు. ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లపాటు సీఎంగా, అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు 2014 నుంచి 2019కు […]

చంద్రబాబు భద్రతపై తదుపరి విచారణ 9కి వాయిదా
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 03, 2019 | 5:06 PM

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు భద్రత తగ్గింపు విషయంపై హైకోర్టులో వాదనలు ముగిసాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేశారు. తాను మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నానని.. తనకు రాష్ట్రప్రభుత్వం తగ్గించిన భద్రతను పెంచాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. పాత భద్రతను పునరుద్ధరించాలంటూ సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు.

ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లపాటు సీఎంగా, అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు 2014 నుంచి 2019కు తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించానని పిటిషన్ పేర్కొన్నారు. అంతేగాక ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించానని.. ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నానని తెలిపారు. ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా ఉన్న వారు నాకు వ్యక్తిగత భద్రత తగ్గించారని.. అలాగే నా రెండు నివాసాల వద్ద కూడా భద్రతను తగ్గించారని పేర్కొన్నారు. నేను సీఎంగా ఉండగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు తీసుకున్న పలు చర్యల కారణంగా నా ప్రాణానికి ముప్పు ఏర్పడిందన్న నివేదికల ఆధారంగా కేంద్రప్రభుత్వం జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పించిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా భద్రతను కుదించారంటూ వెల్లడించారు. తాను మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నానని, 2003 అక్టోబరు 1న తనపై అలిపిరి వద్ద దాడి జరిగిందని గుర్తు చేశారు. వీటన్నిటి నేపథ్యంలోనే తనకు జడ్‌ ప్లస్‌ భద్రత ఉందన్నారు.