వలస కార్మికుల తరలింపుపై హైకోర్టులో విచారణ..!

స్వస్ధలాలకు వలస కార్మికుల తరలింపుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఆనంద్ భాటియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు.

వలస కార్మికుల తరలింపుపై హైకోర్టులో విచారణ..!
Follow us

| Edited By:

Updated on: Jun 23, 2020 | 6:19 PM

Stranded Labour: స్వస్ధలాలకు వలస కార్మికుల తరలింపుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఆనంద్ భాటియా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ప్రత్యేకంగా అదనపు బోగీలు ఏర్పాటు చేయడం సాంకేతికంగా వీలు కాదని డీఆర్ఎం తెలిపారు. బీహార్ కు చెందిన 45మంది వలస కూలీలను రేపు స్వస్ధలాలకు చేరుస్తామని ఆయన స్పష్టంచేశారు. అత్యవసర కోటాలో రేపటి రైళ్లలో టికెట్లు ఖరారు చేస్తామని డీఆర్ఎం తెలిపారు. కలెక్టర్లు కోరితే రోజుకు 50 మంది వలస కూలీలకు ఈక్యులో టికెట్లు కేటాయించేందుకు సిద్ధమని డీఆర్ఎం వెల్లడించారు. వలస కార్మికులందరూ స్వస్ధలాలకు చేరే వరకు ఇదే విధానం కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 26కి హైకోర్టు వాయిదా వేసింది.