ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రాజధాని కోసం ఆందోళన చేస్తున్న మహిళల పట్ల ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును అమరావతి హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పు పట్టింది. ఏ కారణంగా బెజవాడ ర్యాలీలో పాల్గొన్న 610 మందిని అరెస్టు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. రాజధాని గ్రామాల్లో మహిళను బూటు కాలితో మగ పోలీస్ తన్నడంపై వివరణ అడిగింది. మహిళ నోరు ఎందుకు బలవంతంగా నొక్కరని ప్రశ్నించింది హైకోర్టు ధర్మాసనం. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేయవద్దన్న […]

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
Follow us

|

Updated on: Jan 17, 2020 | 1:34 PM

రాజధాని కోసం ఆందోళన చేస్తున్న మహిళల పట్ల ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరును అమరావతి హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పు పట్టింది. ఏ కారణంగా బెజవాడ ర్యాలీలో పాల్గొన్న 610 మందిని అరెస్టు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. రాజధాని గ్రామాల్లో మహిళను బూటు కాలితో మగ పోలీస్ తన్నడంపై వివరణ అడిగింది. మహిళ నోరు ఎందుకు బలవంతంగా నొక్కరని ప్రశ్నించింది హైకోర్టు ధర్మాసనం.

అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేయవద్దన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారని అడిగింది హైకోర్టు బెంచ్. అయితే.. 2014 నుంచి రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని వాటిని కొనసాగిస్తున్నామని, కొత్తగా అమల్లోకి తేలేదని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ధర్మాసనం ముందు వివరణ ఇచ్చుకున్నారు.

రాజధాని వీధుల్లో పోలీసులు మార్చ్ ఫాస్ట్, పరేడ్ చేయాల్సిన అవసరం ఏంటని ధర్మాసనం పోలీసు ఉన్నతాధికారులను నిలదీసింది. అయితే.. అమరావతిలో ప్రశాంత పరిస్థితులు వున్నాయంటూ ఏజీ శ్రీరామ్ సమాధానమివ్వడంతో ‘‘ అయితే పోలీసు బలగాల మోహరింపు ఎందుకు ’’ అని హైకోర్టు ఎదురు ప్రశ్న వేసింది. శుక్రవారం విచారణలో సుమారు గంటపాటు వాదనలు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించగా… తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..