బ్రేకింగ్: ‘దిశ’ నిందితుల అంత్యక్రియలకు హైకోర్టు మళ్లీ బ్రేక్

ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ నిందితుల అంత్యక్రియలకు హైకోర్టు మళ్లీ బ్రేక్ వేసింది. ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది. అంతవరకు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి, అక్కడ భద్రపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఏసీ అంబులెన్స్‌లల్లో ఈ మృతదేహాలు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎన్‌కౌంటర్‌పై విచారణకు హైకోర్టు తరపున ప్రత్యేక న్యాయవాదిగా మాజీ ఏజీ ప్రకాష్ రెడ్డిని హైకోర్ట్ నియమించింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. హైకోర్టు […]

బ్రేకింగ్: 'దిశ' నిందితుల అంత్యక్రియలకు హైకోర్టు మళ్లీ బ్రేక్
Follow us

| Edited By:

Updated on: Dec 09, 2019 | 5:39 PM

ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ నిందితుల అంత్యక్రియలకు హైకోర్టు మళ్లీ బ్రేక్ వేసింది. ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది. అంతవరకు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి, అక్కడ భద్రపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఏసీ అంబులెన్స్‌లల్లో ఈ మృతదేహాలు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఎన్‌కౌంటర్‌పై విచారణకు హైకోర్టు తరపున ప్రత్యేక న్యాయవాదిగా మాజీ ఏజీ ప్రకాష్ రెడ్డిని హైకోర్ట్ నియమించింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.

కాగా దిశ హత్యాచారం కేసులో నిందితులను రిమాండ్‌లోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం శుక్రవారం తెల్లవారుజామున దిశను కాల్చిన ప్రదేశానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నిందితులు, పోలీసుల మధ్య అనూహ్యంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌ చోటుచేసింది. ఉదయం గం.5.45 నుంచి గం.6.15నిమిషాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత వారి మృతదేహాలను మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. కానీ ఈ ఎన్‌కౌంటర్‌పై మహిళా సంఘాలు హైకోర్టును ఆశ్రయించడంతో అంత్యక్రియలకు ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశంతో నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించనున్నారు.