ఖ‌మ్మం జిల్లాలో తొలి క‌రోనా పాజిటివ్ కేసు..ల‌క్ష‌ణాలు లేకున్నా..

తెలంగాణ‌లో క‌రోనా టెర్ర‌ర్ క్రియేట్ చేస్తోన్నా..ఖ‌మ్మం జిల్లాలో మాత్రం ఇంత‌వ‌ర‌కు ఒక్క కేసు న‌మోదు కాలేదు. దీంతో జిల్లాలోని ప్ర‌జలంతా సేఫ్ అని భావించారు. కానీ అక్క‌డ కూడా ఇప్పుడు క‌రోనా పాజిటివ్ కేసు న‌మోద‌వ్వ‌డంతో..జిల్లా వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో టెన్ష‌న్ నెల‌కుంది. ఖమ్మం రూరల్ పరిధిలోని పెద్ద తండాలో నివాసం ఉంటున్న 45 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్ది రోజుల క్రితం మహబూబాబాద్ నుంచి నిజాముద్దీన్ సభకు ఢిల్లీకి వెళ్లిన […]

ఖ‌మ్మం జిల్లాలో తొలి క‌రోనా పాజిటివ్ కేసు..ల‌క్ష‌ణాలు లేకున్నా..
Follow us

|

Updated on: Apr 07, 2020 | 4:55 PM

తెలంగాణ‌లో క‌రోనా టెర్ర‌ర్ క్రియేట్ చేస్తోన్నా..ఖ‌మ్మం జిల్లాలో మాత్రం ఇంత‌వ‌ర‌కు ఒక్క కేసు న‌మోదు కాలేదు. దీంతో జిల్లాలోని ప్ర‌జలంతా సేఫ్ అని భావించారు. కానీ అక్క‌డ కూడా ఇప్పుడు క‌రోనా పాజిటివ్ కేసు న‌మోద‌వ్వ‌డంతో..జిల్లా వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో టెన్ష‌న్ నెల‌కుంది. ఖమ్మం రూరల్ పరిధిలోని పెద్ద తండాలో నివాసం ఉంటున్న 45 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్ది రోజుల క్రితం మహబూబాబాద్ నుంచి నిజాముద్దీన్ సభకు ఢిల్లీకి వెళ్లిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అతనితో కలిసి ప్రయాణం చేసిన వారిని క్వారంటైన్‌కి తరలించి బ్లడ్ శాంపిల్స్ పంపించారు.

సోమవారం (ఏప్రిల్ 6)  రిపోర్టులో క్వారంటైన్ లో ఉన్న‌వారిలో ఖమ్మంకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అతన్ని కలిసిన 40 మంది వ్యక్తులను క్వారంటైన్‌కి తరలించి టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. అయితే ఎటువంటి సింట‌మ్స్ లేకపోయినా బాధితుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. జలుబు, జ్వరం దగ్గు లాంటి లక్షణాలేవీ అతడికి లేవని వెల్ల‌డించారు. బాధితుడు టీబీ పేషెంట్‌ కావడంతో డాక్ట‌ర్లు అప్రమత్తంగా ఉండి చికిత్స చేస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు డీఎంహెచ్‌వో మాలతి.