తిర్యాణి అడవుల్లో డీజీపీ ఆకస్మిక పర్యటన

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ -మహారాష్ట్ర సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. మూడు రోజులుగా రాష్ట్ర సరిహద్దులో మకాం వేసిన డీజీపీ, తిర్యాణి అడవుల్లో పర్యటించి, పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తిర్యాణి అడవుల్లో డీజీపీ ఆకస్మిక పర్యటన
Follow us

| Edited By:

Updated on: Sep 05, 2020 | 10:02 AM

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ -మహారాష్ట్ర సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. గ్రేహౌండ్స్ బృందాలు అడవులను జల్లెడపడుతున్నాయి. మూడు రోజులుగా రాష్ట్ర సరిహద్దులో మకాం వేసిన డీజీపీ తిర్యాణి అడవుల్లో పర్యటించి, పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరోవైపు ఆదివాసీ శంకర్ ది బూటకపు ఎన్ కౌంటర్ అంటూ రేపు చర్ల, శబరి ప్రాంతాల్లో మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు.

రాష్ట్ర సరిహద్దులో మకాం వేసిన డీజీపీ మహేందర్‌ రెడ్డి పర్యటన వరుసగా నాలుగో రోజు కొనసాగుతోంది. మూరుమూల ప్రాంతాల్లోని పోలీస్‌ స్టేషన్లను తనిఖీ చేస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా పోలీస్‌ స్టేషన్లను తిరుగుతూ.. పోలీసుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. రాత్రి 11 గంటలకు ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి అడవుల్లో పర్యటించి, అరగంటపాటు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. డీజీపీ పలు ఫైళ్లను పరిశీలించారు. అక్కడ ఉన్న ఏర్పాట్లు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గత మూడు రోజులుగా ఆసిఫాబాద్‌ జిల్లాలో మహేందర్ రెడ్డి పర్యటిస్తున్నారు. మావోయిస్టుల సంచారంతో జిల్లాలో హై అలర్ట్‌ కొనసాగుతోంది. డీజీపీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రేహౌండ్స్ టీమ్స్ అడవులను జల్లెడ పడుతున్నాయి.

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ -మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆపరేషన్ మావోయిస్టు నాలుగో రోజు కొనసాగుతోంది. శుక్రవారం డీజీపీ మహేందర్‌రెడ్డి మారుమూల ప్రాంతం తిర్యాణిలో పర్యటించారు. మావోయిస్టుల సంచారం, పోలీసుల చర్యలపై గురువారం విస్తృతంగా సమీక్షలు నిర్వహించారు. బుధవారం ఆసిఫాబాద్ మొదలుకొని కొమరంభీమ్, ఉట్నూర్, ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో గంటన్నర పాటు డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఆసిఫాబాద్ ఎస్పీ క్యాంప్ ఆఫీసులో సుదీర్ఘంగా సమీక్షించారు.

మావోయిస్టుల ఏరివేత, కట్టడి చర్యలపై డీజీపీ దిశా నిర్దేశం చేశారు. మరో రెండ్రోజులపాటు ఆసిఫాబాద్‌లోనే డీజీపీ మహేందర్‌రెడ్డి మకాం వేయనున్నారు. క్షేత్ర స్థాయిలో ఏరియల్ సర్వే, సమీక్షలతో స్వయంగా డీజీపీనే రంగంలోకి దిగారు. 45 రోజుల్లో ఆసిఫాబాద్‌లో డీజీపీ మహేందర్‌ రెడ్డి రెండోసారి పర్యటించారు.

తిర్యాని మండలం మంగి అడవుల్లో మంచిర్యాల కమిటీ కార్యదర్శి భాస్కర్ అలియాస్ అడెల్లు, ఐదుగురు సభ్యులు రెండు సార్లు తప్పించుకున్నారు. పోలీసుల కూంబింగ్‌లో మావోయిస్టుల డైరీ లభ్యమయ్యింది. మావోయిస్టు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన కీలక సమాచారం అందులో లభించినట్లు తెలుస్తోంది.

మరోవైపు కూంబింగ్ ఆపరేషన్‌పై కరోనా ఎఫెక్ట్ పడింది. పలువురు గ్రే హౌండ్స్‌ ఏఆర్‌ సివిల్‌ పోలీసులు కోవిడ్‌ బారిన పడినట్టు సమాచారం.

బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ప్రయాణికులకు ఇండియన్‌ రైల్వే గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఆ సమస్య ఉండదు
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
ధోని సిక్స్‌లకు బిత్తరపోయిన ముంబై ముద్దగుమ్మలు..
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
విద్యార్థులు, కూలీలతో వెళ్తున్న పడవ బోల్తా.. నలుగురు మృతి
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
వీరు బిల్డప్ బాబాయ్‌లు కాదు.. బౌలర్ల పాలిట యముళ్లు.. ఎవరంటే?
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్