‘జగదేక వీరుడి’ గురించి ఎన్టీఆర్‌ ఏమన్నారు.. ఉంగరాన్ని మింగిన ఆ చేప ఏమైంది..!

1990లో తెలుగు సినిమా చరిత్ర స్థాయిని పెంచిన అద్భుత దృశ్యకావ్యం జగదేక వీరుడు అతిలోక సుందరి. అప్పటివరకు వరుస ఫ్లాప్‌ల్లో ఉన్న రాఘవేంద్రరావు ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. చిరంజీవికి గుర్తుండిపోయే సోషియో ఫాంటసీ చిత్రాన్ని బహుమానంగా ఇవ్వాలనుకున్న అశ్వనీదత్.. ఈ మూవీతో తన కోరికను తీర్చుకున్నారు. అంతేకాదు ఇటు చిరంజీవి, అటు శ్రీదేవీ తమ కెరీర్లలో గుర్తుండిపోయే మరో చిత్రాన్ని ఖాతాలో వేసుకున్నారు. తుఫాన ధాటికి నిలబడి మరీ.. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ […]

'జగదేక వీరుడి' గురించి ఎన్టీఆర్‌ ఏమన్నారు.. ఉంగరాన్ని మింగిన ఆ చేప ఏమైంది..!
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: May 09, 2020 | 10:39 PM

1990లో తెలుగు సినిమా చరిత్ర స్థాయిని పెంచిన అద్భుత దృశ్యకావ్యం జగదేక వీరుడు అతిలోక సుందరి. అప్పటివరకు వరుస ఫ్లాప్‌ల్లో ఉన్న రాఘవేంద్రరావు ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. చిరంజీవికి గుర్తుండిపోయే సోషియో ఫాంటసీ చిత్రాన్ని బహుమానంగా ఇవ్వాలనుకున్న అశ్వనీదత్.. ఈ మూవీతో తన కోరికను తీర్చుకున్నారు. అంతేకాదు ఇటు చిరంజీవి, అటు శ్రీదేవీ తమ కెరీర్లలో గుర్తుండిపోయే మరో చిత్రాన్ని ఖాతాలో వేసుకున్నారు. తుఫాన ధాటికి నిలబడి మరీ.. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం వచ్చి సరిగ్గా ఈ రోజుకు 30 సంవత్సరాలు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అప్పటి ఙ్ఞాపకాలను తెలిపింది. నాచురల్ స్టార్ నాని వాయిస్‌ ఓవర్‌లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూడో కథ ఏంటంటే..!

”1990 మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరికి రిలీజ్‌ డేట్ ఫిక్స్‌ చేశారు. అప్పట్లో అతి పెద్ద బడ్జెట్‌తో నిర్మించారు ఈ చిత్రాన్ని. అప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు సెన్సేషన్‌ క్రియేట్ చేశాయి. అన్నీ సరిగ్గా కుదిరాయి అన్న సమయానికి మే 6వ తేదిన తుఫాను వార్తలు మొదలయ్యాయి. సినిమా ప్రింట్స్‌ కూడా ఎలా పంపాలో తెలీని పరిస్థితి. భారీ వర్షాల దెబ్బకి ఎక్కడి రైళ్లు అక్కడ ఆగిపోయాయి. చెట్లు, కరెంట్ స్థంబాలు కూలిపోయి రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. ప్రింట్స్‌ పంపడం ఎలా..? మరోవైపు రిలీజ్‌ ఆగకూడదు. దీంతో తుఫాన్‌ను ఎదిరించి థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. అయితే భారీ వర్షాలతో పలు థియేటర్లలోకి, ప్రొటెక్టర్ రూమ్‌లోకి నీళ్లు కూడా పోయాయి. కొన్ని చోట్ల మార్నింగ్‌ షోలు పడలేదు. ఎన్నో అంచనాలతో తెరకెక్కించిన ఈ సినిమా నీటి పాలవుతుందని, చేసిన ప్రమోషన్లు వరద నీళ్లలో కొట్టుకుపోతాయని అశ్వనీదత్ ఆలోచించారు. ఏదేతేనేం జరిగేది జరుగుతుంది. తరువాత జరగాల్సినది చూడాలి అనుకుంటూ అశ్వనీదత్, రాఘవేంద్ర రావు విజయవాడ వెళ్లారు.

11వ తారీఖున విజయవాడ వెళ్లగానే.. రాఘవేంద్ర రావును ఓ హోటల్‌లో ఉంచిన అశ్వనీదత్, తన ఇంటికి వెళ్లారు. ఇంట్లో కరెంట్ లేకపోగా.. ఓ చిన్న లాంతర్ వెలుగులో దత్ కుటుంబ సభ్యులు భోజనం చేస్తున్నారు. ఇంట్లో చీకటి.. దత్ మనసులో చీకటి. ఇదే తన ఆఖరు సినిమా అవుతుందేమోనని అశ్వనీదత్ అన్నారట. వెంటనే ఆయన తండ్రి ధర్మరాజు గారు.. ఏం పర్లేదు మంచి సినిమా తీశావు. సెటిల్ అవుతావు అని చెప్పారట. మరుసటి రోజు రాఘవేంద్రరావుతో కలిసి దత్.. గుంటూరులోని ఓ థియేటర్‌కు వెళ్లారట. అక్కడ పరిస్థితి వేరేలా ఉంది. క్లాస్ ఆడియెన్స్‌ మాస్ ఆడియెన్స్‌లా రెచ్చిపోతున్నారు. చప్పట్లు, ఈలలతో గోలగోలగా ఉండటాన్ని చూసి సినిమాపై చిన్న తృప్తి తెనాలి వెళ్లారు. అప్పుడు మరో మరుపురాని సంఘటన జరిగింది.

ఎన్టీఆర్ అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉండగా.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటన చేస్తూ వారికి ఎదురుపడ్డారు. ఆ సందర్భంగా సినిమా రిపోర్ట్‌ బావుంది. సెటిల్ అయిపోతావు. కంగారు పడకు. నేను చెప్తున్నా అని ధైర్యం చెప్పి తన ప్రోగ్రామ్‌లోకి వెళ్లిపోయారు. ఆ మాటలు విని ధైర్యంతో కారు ఎక్కబోతుంటే.. సైకిల్‌పై అరటి పళ్లతో అటుగా వచ్చిన ఓ వ్యక్తి ఇప్పుడే సినిమా చూశాను. అదిరిపోయింది. సంవత్సరం ఆడుతుంది అని గట్టిగా అరిచాడట. దీంతో దత్, రాఘవేంద్రరావు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారట. ఇక అక్కడి నుంచి ఈ సినిమా తన బీభత్సాన్ని చూపించింది. తుఫాను, వర్షం ఏవీ జగదేక వీరుడు అతిలోక సుందరిని ఆపలేకపోయాయి. ప్రతి షో హౌస్‌ఫుల్‌ అవ్వగా.. పడవల్లో వచ్చి మరీ సినిమా చూశారట. తెలుగు సినిమా చరిత్రలో తుఫానుగా వచ్చిన ఈ చిత్రం వచ్చి 30 ఏళ్లు కాగా.. కొన్ని అనుమానాలు ఇంకా వెంటాడుతున్నాయి. అవేంటంటే.. ఉంగరం ఏమైంది..? ఉంగారాన్ని మింగిన చాప ఏమైంది..?” ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ కచ్చితంగా తీస్తానని ఇటీవల నిర్మాత అశ్వనీదత్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఆ సీక్వెల్‌లో ఈ ప్రశ్నలకు సమాధానం తెలుస్తుందేమో చూడాలి.

Read This Story Also: లాక్‌డౌన్ సడలింపులు.. ఐటీ ఉద్యోగుల లాగిన్, లాగ్ అవుట్ సమయాలివే..!

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!