Breaking News
  • క్వారంటైన్‌ కేంద్రాలుగా స్టార్‌ హోటళ్లు. భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 12 హోటళ్లలో.. క్వారంటైన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసిన ఒడిశా ప్రభుత్వం. ముందుజాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారంటైన్‌ గదిలో ఉండాలనుకునేవారు.. డబ్బులు చెల్లించి ప్రైవేట్‌ హోటళ్లలో ఉండొచ్చన్న ప్రభుత్వం. రోజుకు రూ.2,500 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటన.
  • కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. మానవ కణాల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకునే.. కొత్త ఔషధాన్ని సిద్ధంచేసిన ఎంఐటీ శాస్త్రవేత్తలు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా నయం చేస్తుందని ప్రకటన.
  • ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ బి.పి.కనుంగో పదవీకాలం పొడిగింపు. రేపటితో ముగియనున్న బి.పి.కనుంగో పదవీకాలం. కనుంగో పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్బీఐ ప్రకటన.
  • కోత కాదు వాయిదా. ఏపీపై కరోనా తీవ్ర ప్రభావం. ప్రజాప్రతినిధుల జీతాలు వాయిదా. సీఎం నుంచి స్థానిక సంస్థల సభ్యుల వరకు.. 100 శాతం జీతాన్ని వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల జీతాల్లో 60 శాతం వాయిదా. నాలుగో తరగతి ఉద్యోగుల జీతంలో 10 శాతం వాయిదా. మిగతా ఉద్యోగుల జీతంలో 50 శాతం వాయిదా. వాయిదా వేసిన జీతాలు మళ్లీ చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం.
  • ఏపీలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌. ప.గో జిల్లాలో 14 పాజిటివ్‌ కేసులు నమోదు. నిన్నటి వరకు ఒక్క కేసూ లేని జిల్లాలో ఒకేసారి బయటపడ్డ 14 కేసులు. బాధితులంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్టు గుర్తింపు. ఏపీలో మొత్తం 58కి చేరిన కరోనా కేసులు.

కమల్ ఇచ్చిన ఆ సలహా నాలో ఆత్మస్థైరాన్ని పెంచింది: రాణి ముఖర్జీ

లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన విషయంలో ఆయనకు ఆయనే సాటి. అంతేకాదు దర్శకుడిగా,
Hey Ram completes 20 years, కమల్ ఇచ్చిన ఆ సలహా నాలో ఆత్మస్థైరాన్ని పెంచింది: రాణి ముఖర్జీ

Hey Ram completes 20 years: లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటన విషయంలో ఆయనకు ఆయనే సాటి. అంతేకాదు దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా.. మల్టీ టాలెంటెడ్‌తో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని రాసుకున్నారు కమల్. ఆయనతో నటిస్తే నటనలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చంటూ పలువురు పేరు మోసిన నటీనటులు సైతం పలు సందర్భాల్లో వెల్లడించారు. ఇక ఇదే విషయాన్ని బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ చెప్పుకొచ్చారు. హేరామ్ చిత్రంలో కమల్ సరసన రాణి నటించారు. ఈ సినిమాలో కమల్‌ పక్కన నటించడం తన కెరీర్‌లో గుర్తుండిపోయే విషయమని అన్నారు.

హేరామ్ చిత్రం 20సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్ర షూటింగ్ విశేషాలకు ఆమె గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా తన కెరీర్ ప్రారంభంలోనే కమల్‌తో నటించే అవకాశం రావడంతో.. నటనపరంగా ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. ఇక షూటింగ్‌లో కమల్ తనకు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారని రాణి ముఖర్జీ అన్నారు. ముఖ్యంగా తాను పొట్టిగా ఉండటంతో అప్పట్లో కాస్త ఎత్తుగా ఉన్న చెప్పులు వేసుకునేదాన్నని.. అది చూసిన కమల్, తనకు ఓ సలహా ఇచ్చారని రాణి చెప్పుకొచ్చారు. పొట్టిగా ఉన్నానని తాను బాధపడుతుంటే.. ఎవ్వరైనా మన ఎత్తును చూసి మనల్ని గుర్తించరు, కానీ మనం సాధించిన విజయాలను చూసే గుర్తిస్తారు అని అప్పట్లో కమల్ తనకు సలహా ఇచ్చారని పేర్కొన్నారు. అప్పటి నుంచి తన ఎత్తు విషయంలో తెలియకుండానే కొత్త ఆత్మవిశ్వాసం పుట్టుకొచ్చిందని తెలిపారు. నటుడికి ఎత్తుతో పనిలేదని, నటించడం, పాత్రలో ఒదిగిపోవడం చాలని అప్పట్లో కమల్ ఇచ్చిన సలహా.. తన కెరీర్‌ను అద్భుతంగా మలుచుకోవడంలో ఎంతో సహాయం చేసిందని రాణి ముఖర్జీ అన్నారు.

Read This Story:మూతపడనున్న రామానాయుడు స్టూడియో.. అసలు కారణమిదేనా..?

Related Tags