రాశి, రంభ యాడ్స్ ఆపేయాలి.. కోర్టు సంచలన తీర్పు

వెయిట్ లాస్ క్లినిక్స్ లో ప్రసిద్ధి చెందిన సంస్థ కలర్స్.. ఈ సంస్థ ప్రసార మాధ్యమాల్లో హీరోయిన్లు రాశి, రంభ లచే నిర్వహించే ప్రకటనలను వెంటనే ఆపేయాలని విజయవాడ కన్స్యూమర్స్ ఫోరమ్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆ సంస్థ ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయిన ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అసలు విషయంలోకి వెళ్తే.. విజయవాడ కు చెందిన ఒక వ్యక్తి వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కోసం దాదాపు 75,000 […]

రాశి, రంభ యాడ్స్ ఆపేయాలి.. కోర్టు సంచలన తీర్పు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:32 PM

వెయిట్ లాస్ క్లినిక్స్ లో ప్రసిద్ధి చెందిన సంస్థ కలర్స్.. ఈ సంస్థ ప్రసార మాధ్యమాల్లో హీరోయిన్లు రాశి, రంభ లచే నిర్వహించే ప్రకటనలను వెంటనే ఆపేయాలని విజయవాడ కన్స్యూమర్స్ ఫోరమ్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆ సంస్థ ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయిన ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

అసలు విషయంలోకి వెళ్తే.. విజయవాడ కు చెందిన ఒక వ్యక్తి వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కోసం దాదాపు 75,000 రూపాయలు కట్టి మోసపోయాడట. దీనితో ఆ వ్యక్తి కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించి కలర్స్ క్లినిక్ పై కంప్లైంట్ చేశాడు. అంతేకాకుండా టీవీ ఛానెల్స్ లో తప్పుదారి పట్టించేలా ఉన్న కలర్స్ వారి ప్రకటనలను ఆపాలని కోర్టువారిని కోరాడు. కంప్లైంట్ లో నిజానిజాలను పరిశీలించిన కోర్టు.. ఆ వ్యక్తి కట్టిన మొత్తం డబ్బును 9 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని సూచించింది. అలాగే 2 లక్షల ను జరిమానాగా వినియీగదారుల సంక్షేమ నిధికి చెల్లించాలని చెప్పింది. దీనితో పాటు రాశి, రంభల ప్రకటనలను సైతం వెంటనే ఆపేయాలని కోర్టు తీర్పునిచ్చింది.

ఇలాంటి తప్పుడు ప్రకటనలను సెలెబ్రిటీస్ ప్రోత్సహించడం సరికాదని.. మరోసారి ఇలాంటిదే జరిగితే సినీతారలకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.