‘కార్తికేయ 2’లో హీరోయిన్ ఎవరంటే..!

యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ’. 2014లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాతోనే చందు మొండేటి టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన తీసిన ‘సవ్యసాచి’ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది.

దాంతో చందు మొండేటి నాగార్జునతో అనుకున్న ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. ప్రస్తుతం చందు తన తరువాత సినిమా నిఖిల్ తో ‘కార్తికేయ 2’ చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా ఇందులో హీరోయిన్ గా కలర్స్ స్వాతిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ లో తీసిన క్లైమాక్స్ నుంచి కొనసాగింపుగా ఈ సీక్వెల్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ‘కార్తికేయ’ సినిమాలో నటించిన స్వాతి ఈ సీక్వెల్ లో కూడా హీరోయిన్ గా కనిపిస్తుందని సమాచారం. కాగా ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఉంటుందట. మొత్తానికి పెళ్లి తర్వాత కలర్స్ స్వాతి ఈ సినిమాతో మళ్లీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *