పరీక్ష రాసిన సాయి పల్లవి

ఓ వైపు సినిమాలు చేస్తూనే వైద్య విద్యను పూర్తి చేసే విషయంపై దృష్టిపెట్టారు. ఆ క్రమంలో బ్లాంక్ చెక్ ఇచ్చి తమ సినిమాల్లో ఆఫర్ ఇస్తే కూడా సాయిపల్లవి డబ్బుకు కాకుండా చదువుకే ఓకే చెప్పారు. అలా ఆమె తన చదువును ఇటీవల పూర్తి చేశారు. అయితే విదేశాల్లో..

పరీక్ష రాసిన సాయి పల్లవి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 02, 2020 | 2:12 PM

డాక్టర్ కావాలని చాలా మందిలో ఉంటుంది. అదే లక్ష్యంగా విజయం సాధించేవారు కూడా ఉంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చిన అనుకున్న టార్గెట్ ను సాధిస్తారు. ఇలాంటి ఉన్నత లక్ష్యాన్ని సాధించారు తమిళ సోయగం సాయిపల్లవి. డాక్టర్‌ అయిన తర్వాతే యాక్టర్‌గా మారిందని చెప్పొచ్చు. సినిమాల్లోకి అరంగేట్రం చేసే సమయానికే ఈ సొగసరి విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించారు.

ఓ వైపు సినిమాలు చేస్తూనే వైద్య విద్యను పూర్తి చేసే విషయంపై దృష్టిపెట్టారు. ఆ క్రమంలో బ్లాంక్ చెక్ ఇచ్చి తమ సినిమాల్లో ఆఫర్ ఇస్తే కూడా సాయిపల్లవి డబ్బుకు కాకుండా చదువుకే ఓకే చెప్పారు. అలా ఆమె తన చదువును ఇటీవల పూర్తి చేశారు. అయితే విదేశాల్లో మెడిసిన్ పూర్తి చేసే విద్యార్థులు భారత్‌లో మెడికల్ బోర్డు నిర్వహించే పరీక్షను తప్పకుండా పాస్ కావాల్సి ఉంటుంది.

విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన సాయి పల్లవి ఇటీవల నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ( FMGE)పరీక్షకు హాజరయ్యారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో డాక్టర్‌గా రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరుచిలోని (MAM college)ఎంఏఎం కాలేజీలో జరిగిన పరీక్షకు హాజరయ్యారు.

మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో చిత్రసీమలోకి ప్రవేశించిన ఈ అమ్మడు అనతికాలంలోనే దక్షిణాదిన అగ్రనాయికగా ఎదిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు.

కరోనా భయం వెంటాడుతున్నా జాగ్రత్తలు తీసుకుంటూ అభిమానులందరికి సెల్ఫీలు తీసుకునే అవకాశం ఇచ్చారు సాయిపల్లవి. ప్రస్తుతం ఈ ఫొటోల్ని కొందరు అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్‌చేయగా వైరల్‌గా మారాయి. సినిమాల్లో అగ్ర కథానాయికగా పేరు సంపాదించుకున్నా వైద్యం మీద ఉన్న మక్కువతో సాయిపల్లవి పరీక్షకు హాజరైందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.