Actress Payal Rajput: మరో స్పెషల్ సాంగ్ కోసం సిద్ధమవుతున్న పాయల్ ? ఆ ఇద్దరు హీరోల సరసన నటించనున్న బ్యూటీ..

హీరో కార్తికేయతో కలిసి 'ఆర్ఎక్స్ 100' సినిమాలో నటించింది హీరోయిన్ పాయల్ రాజ్‏పుత్. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ హిట్

Actress Payal Rajput: మరో స్పెషల్ సాంగ్ కోసం సిద్ధమవుతున్న పాయల్ ? ఆ ఇద్దరు హీరోల సరసన నటించనున్న బ్యూటీ..
Follow us

|

Updated on: Jan 25, 2021 | 7:56 AM

హీరో కార్తికేయతో కలిసి ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో నటించింది హీరోయిన్ పాయల్ రాజ్‏పుత్. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ హిట్ సాధించిన ఈ అమ్మడుకు మాత్రం ఆశించినంతగా హీరోయిన్ ఆఫర్లు రావడం లేదు. దీంతో స్పెషల్ సాంగ్స్ వైపు మల్లింది ఈ బ్యూటీ. ఇప్పటికే కాజల్, శ్రీనివాస్ బెల్లంకొండ హీరోహీరోయిన్లుగా నటింటిన సీత సినిమాలో బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి.. రాజ్‏దూత్ మీదొచ్చే అంటూ ఓ స్పెషల్ సాంగ్‏లో కనిపించింది. తాజాగా సమాచారం ప్రకారం పాయల్ మరో స్పెషల్ సాంగ్‏కు ఓకే చెప్పిందట.

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘మహా సముద్రం’ అనే సినిమా తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. ఇందులో అదితీ రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. ఇక ఈ పాటలో హీరోయిన్ పాయల్ రాజ్‏పుత్ స్టెప్పులేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇక ఆర్ ఎక్స్ 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి మహా సముద్రం మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక త్వరలోనే ఈ స్పెషల్ సాంగ్‏ను చిత్రీకరణ చేయనున్నారట.

Also Read:

ఆర్జీవీ ‘డీ కంపెనీ’ టీజర్ రిలీజ్.. నో డైలాగ్స్.. మరోసారి మ్యూజిక్‏తోనే అదరగొట్టిన డైరెక్టర్..