డిజిటల్‌లో దుమ్ములేపుతోన్న విజయ్ దేవరకొండ..

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండ చేసిన రొమాంటిక్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్‌ టైనర్ 'వరల్డ్ ఫేమస్ లవర్'. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఢీలా పడింది. నాలుగు భిన్నమైన పాత్రల్లో ఎంతో కష్టపడి చేసిన విజయ్..

డిజిటల్‌లో దుమ్ములేపుతోన్న విజయ్ దేవరకొండ..
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 1:50 PM

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవర కొండ చేసిన రొమాంటిక్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్‌ టైనర్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఢీలా పడింది. నాలుగు భిన్నమైన పాత్రల్లో ఎంతో కష్టపడి చేసిన విజయ్.. సినిమా వసూళ్లను మాత్రం పెద్దగా రాబట్టలేకపోయాడు. అయితే తాజగా డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అయిన ఈ సినిమా దుమ్ము లేపుతోంది.

అంతేకాదు ఏకంగా ఈ చిత్రం ఇండియా వైడ్‌గా సెకండ్ పోజిషన్‌లో ట్రెండ్ అవుతోంది. వరల్డ్ ఫేమస్ లవర్ డిజిటల్ హక్కులను ప్రఖ్యాత స్ట్రీమింగ్ సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’ సొంతం చేసుకుంది. అందులో భాంగా నెట్ ఫ్లిక్స్ రెండు రోజుల క్రితం ఈ మూవీని తన సబ్‌స్కైబర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుపోయిన ఈ చిత్రం.. డిజిటల్‌లో మాత్రం విశేష ఆదరణ దక్కించుకుంది. ఇండియా వైడ్‌గా నెట్‌ ఫ్లిక్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతూ నెట్‌ఫ్లిక్స్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. అలాగే విజయ్ నటించిన ‘డియర్ కామ్రెడ్’ చిత్రం కూడా థియేటర్స్‌లో ఆకట్టుకోకపోయినా.. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్‌‌లో విజయం సాధించింది.

Read More: 

అక్కడ బ్లీచింగ్ అమ్మకాలు బంద్.. కారణమిదే!

ఇంటర్‌ సెకండ్ ఇయర్ రిజల్ట్స్‌.. టీఎస్ బోర్డు కీలక నిర్ణయం

ఫేస్‌బుక్‌లో అభ్యంతకర వ్యాఖ్యలు.. ‘రక్త చరిత్ర’ నటుడు అరెస్ట్

రేపటి నుంచి లాక్‌డౌన్ సడలింపులు.. ఏం తెరుచుకుంటాయంటే!