హీరో వెంకటేశ్ పుట్టినరోజు కానుక.. విక్టరీలో కొత్త కోణం.. నారప్ప టీజర్ విడుదల..

హీరో విక్టరీ వెంకటేశ్ పుట్టున రోజు కానుకగా తన అభిమానులకు "నారప్ప" సినిమా టీజర్‏ను విడుదల చేసింది చిత్ర బృందం. సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకీ మెయిన్ రోల్‏లో నటించనుండగా..

హీరో వెంకటేశ్ పుట్టినరోజు కానుక.. విక్టరీలో కొత్త కోణం.. నారప్ప టీజర్ విడుదల..
Follow us

|

Updated on: Dec 13, 2020 | 6:55 AM

హీరో విక్టరీ వెంకటేశ్ పుట్టున రోజు కానుకగా తన అభిమానులకు “నారప్ప” సినిమా టీజర్‏ను విడుదల చేసింది చిత్ర బృందం. సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకీ మెయిన్ రోల్‏లో నటించనుండగా.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ధనుష్ కథానాయకుడిగా సూపర్ హిట్ సాధించిన అసురన్‏కు తెలుగు రీమేక్. వెంకీ భార్యగా ప్రియమణి నటిస్తున్నారు. ఈ మూవీకి మణిశర్మ పాటలు అందిస్తున్నారు. కాగా ఆదివారం వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా శనివారం సాయంత్రం నారప్ప టీజర్‏ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఇందులో వెంకీ వెరి సీరియస్ లుక్‏లో కనిపించనున్నారు.

ఈ ఏడాది జనవరిలో నారప్ప షూటింగ్ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారి విజృంబిస్తున్న సమయంలో ఈ సినిమా షూటింగ్‏ను కొంతకాలంపాటు వాయిదా వేశారు. మళ్ళీ అనంతరం తిరిగి షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, మురళీ శర్మ, కార్తిక్ రత్నన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా వెంకటేశ్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్‏ను షేర్ చేస్తూ “నారప్ప ఫస్ట్ గ్లింప్స్ మీతో పంచుకోవడం గర్వంగా ఉందని” పేర్కొన్నారు.