ప్రైవేట్ స్కూళ్ల బెదిరింపులపై శివబాలాజీ ఫైట్

టాలీవుడ్ హీరో, నటుడు శివబాలాజీ తెలంగాణ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. కరోనా సమయంలో ప్రైవేటు స్కూల్స్ బలవంతపు వసూళ్లపై ఆయన పోరుబాటకు దిగారు. మౌంట్ లిటెరా జీ స్కూల్ యాజమాన్యం అరాచకాలకు.

ప్రైవేట్ స్కూళ్ల బెదిరింపులపై శివబాలాజీ ఫైట్
Follow us

|

Updated on: Sep 14, 2020 | 6:32 PM

టాలీవుడ్ హీరో, నటుడు శివబాలాజీ తెలంగాణ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. కరోనా సమయంలో ప్రైవేటు స్కూల్స్ బలవంతపు వసూళ్లపై ఆయన పోరుబాటకు దిగారు. మౌంట్ లిటెరా జీ స్కూల్ యాజమాన్యం అరాచకాలకు అంతుపొంతూ లేకుండా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులనుంచి రకరకాల కారణాలు చెప్పి బలవంతంగా ఫీజు వసూలు చేస్తోందని.. ఫీజు వసూలు కోసం పరీక్షలు కూడా నిర్వహిస్తోందని ఆయన హెచ్ఆర్సీ కి విన్నవించారు. విద్యార్థుల తల్లితండ్రులు అందరూ కలిసి వాట్సాప్ గ్రూప్ లో ఉంటే తప్పేంటని స్కూల్ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా శివబాలాజీ ప్రశ్నించారు. ఫీజులు చెల్లించని విద్యార్థులకు పరీక్షకు నాలుగు రోజుల ముందు ఆన్లైన్ క్లాసులు కూడా డిస్కనెక్ట్ చేశారని ఆయన తెలిపారు. పిల్లలు పరీక్షల కూడా మిస్ అయ్యారని అన్నారు. ఆన్లైన్ క్లాసులకు సంబంధించి ప్రశ్నిస్తే యాజమాన్యం చాలా దురుసుగా సమాధానం చెబుతోందని.. యాక్షన్ తీసుకుంటామంటూ బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. పాఠశాలలో పిల్లల తల్లిదండ్రుల దే హయ్యెస్ట్ స్టేక్ అన్న బాలాజీ… అలాంటి తమపై యాక్షన్ ఏంటని ప్రశ్నించారు. చాలా మంది తల్లిదండ్రులు భయంతో ముందుకు రావడం లేదని అందుకే తాను ముందుకొచ్చి ఫిర్యాదు చేసినన్నారు.ఇలాఉంటే, బలవంతపు ఫీజు వసూలు, పరీక్షలకు డెడ్ లైన్ విధించడం, తల్లిదండ్రులు అడిగితే యాజమాన్యం స్పందన సరిగా లేకపోవడం, నోటీసు లేకుండా ఆన్ లైన్ పరీక్ష నుంచి తప్పించడం, జీవో నెంబర్ 46 ను అతిక్రమించడం వంటి విషయాలను ఫిర్యాదులో పేర్కొన్నామని బాలాజీ తరపు అడ్వకేట్ రామచంద్ర రెడ్డి తెలిపారు. ఇటువంటి వాటి వల్ల తల్లిదండ్రులు పిల్లలు నష్టపోతున్నారని చెప్పి ఫిర్యాదులో పేర్కొనటం జరిగిందని అన్నారు.