పబ్లిక్ స్మోకింగ్..హీరో రామ్‌కు ఫైన్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఫ్యాచ్ వర్క్ షూట్ ప్రస్తుతం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సీన్ చిత్రీకరణలో భాగంగా రామ్ సిగరెట్ తాగాడు. అయితే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పబ్లిక్ స్మోకింగ్ నిషేదం అనే రూల్ ఉంది. ఆ విషయం తెలియని యూనిట్ సభ్యులు ఆ సీన్‌ను షూట్ చేశారు. చార్మినార్ […]

పబ్లిక్ స్మోకింగ్..హీరో రామ్‌కు ఫైన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 24, 2019 | 9:05 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఫ్యాచ్ వర్క్ షూట్ ప్రస్తుతం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సీన్ చిత్రీకరణలో భాగంగా రామ్ సిగరెట్ తాగాడు. అయితే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పబ్లిక్ స్మోకింగ్ నిషేదం అనే రూల్ ఉంది. ఆ విషయం తెలియని యూనిట్ సభ్యులు ఆ సీన్‌ను షూట్ చేశారు.

చార్మినార్ పరిసర ప్రాంతాల్లో సిగరెట్ పై ఉన్న నిషేదంను రామ్ అతిక్రమించినందుకు గాను తెలంగాణ పోలీసులు అతడికి ఫైన్ వేసినట్లు ఛార్మినార్ సీఐ తెలిపారు. 200 రూపాయల ఫైన్ ను రామ్ చెల్లించినట్లుగా తెలుస్తోంది. కోప్టా యాక్ట్ 2003 సెక్షన్ 4 ప్రకారం కీలక ప్రాంతాలైన కొన్ని చోట్ల ఓపెన్ గా దూమపానం చేయడం నిషిద్దం.