రోడ్‌ యాక్సిడెంట్‌పై రాజశేఖర్‌ క్లారిటీ..!

రోడ్ యాక్సిడెంట్‌పై నటుడు రాజశేఖర్.. క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నానని.. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని.. కారులో నేను ఒక్కడినే ప్రయాణించానని చెప్పారు. అయితే.. ప్రమాదానికి గల కారణాలను మాత్రం ఆయన చెప్పలేదు. కాగా.. అతివేగమే రాజశేఖర్ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మంగళవారం అర్థరాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తుండగా.. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై.. పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:30 am, Wed, 13 November 19
రోడ్‌ యాక్సిడెంట్‌పై రాజశేఖర్‌ క్లారిటీ..!

రోడ్ యాక్సిడెంట్‌పై నటుడు రాజశేఖర్.. క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను క్షేమంగా ఉన్నానని.. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని.. కారులో నేను ఒక్కడినే ప్రయాణించానని చెప్పారు. అయితే.. ప్రమాదానికి గల కారణాలను మాత్రం ఆయన చెప్పలేదు. కాగా.. అతివేగమే రాజశేఖర్ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.

మంగళవారం అర్థరాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తుండగా.. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై.. పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. కారులో నేను ఒక్కడినే ప్రయాణిస్తున్నాను. కారు టైర్ బ్లాస్ట్‌ అవడంతొ.. అదుపు తప్పి.. బోల్తా పడిందని.. రాజేశేఖర్ తెలిపారు. నేను కారు లోపలే ఉన్నాను. ఎదురుగా వస్తోన్న వారు ఆగి.. నన్ను గుర్తుపట్టి.. విన్ షీల్డ్‌లో నుంచి బయటకు లాగారు.

నా ఫోన్ స్విచ్‌ ఆఫ్ అవడంతో.. నేను బయటకు రాగానే.. వారి దగ్గరున్న ఫోన్ తీసుకుని.. మొదట పోలీసులకి.. ఆ తరువాత నా కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాను. ఆ తరువాత ఆక్కడున్న వారి కారులో ఇంటికి బయలు దేరాను. ఈలోపు మా కుటుంబ సభ్యులే ఎదురు వచ్చి నన్ను పికప్ చేసుకుని, ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు రాజశేఖర్.