రెండు నెలలు జాలీగా డార్లింగ్..!

మూడు నెలల పాటు తీరిక లేకుండా ‘సాహో’ సినిమా విడుదల, ప్రమోషన్స్ వ్యవహారాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు ఫారిన్ చెక్కేశాడు. అక్కడ హాయిగా సేద దీరనున్నాడు. యూరప్‌లో కొన్నాళ్లు రిలాక్స్ అయి వచ్చే నెలలో ఇండియాకి తిరిగొస్తాడట. ఆదివారం పారిస్‌కి పయనం అయ్యాడు. సాహో సినిమా రిలీజ్‌కి ముందే ప్రభాస్.. ఒక రొమాంటిక్ సినిమా మొదలుపెట్టాడు. ‘జిల్’ సినిమా తీసిన.. డైరెక్టర్‌తో గతేడాదే సినిమా మొదలుపెట్టాడు ప్రభాస్. హీరోయిన్‌గా పూజా హెగ్డేని తీసుకున్నారు. ఇప్పటికే ఇటలీలో […]

రెండు నెలలు జాలీగా డార్లింగ్..!
Follow us

| Edited By:

Updated on: Sep 23, 2019 | 9:43 PM

మూడు నెలల పాటు తీరిక లేకుండా ‘సాహో’ సినిమా విడుదల, ప్రమోషన్స్ వ్యవహారాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు ఫారిన్ చెక్కేశాడు. అక్కడ హాయిగా సేద దీరనున్నాడు. యూరప్‌లో కొన్నాళ్లు రిలాక్స్ అయి వచ్చే నెలలో ఇండియాకి తిరిగొస్తాడట. ఆదివారం పారిస్‌కి పయనం అయ్యాడు.

సాహో సినిమా రిలీజ్‌కి ముందే ప్రభాస్.. ఒక రొమాంటిక్ సినిమా మొదలుపెట్టాడు. ‘జిల్’ సినిమా తీసిన.. డైరెక్టర్‌తో గతేడాదే సినిమా మొదలుపెట్టాడు ప్రభాస్. హీరోయిన్‌గా పూజా హెగ్డేని తీసుకున్నారు. ఇప్పటికే ఇటలీలో 30 రోజులపాటు అక్కడ షూటింగ్ తీశారు. అయితే ఇప్పుడు ఆ సినిమా షూటింగ్‌ని మళ్లీ మొదలుపెట్టాలంటే.. ఫ్రెష్‌గా కనిపించాలని.. రిలాక్సేషన్ కోసం ఫారిన్ వెళ్లాడు.

సాహో సినిమా బాలీవుడ్‌‌లో సూపర్‌ హిట్టయింది. కానీ తెలుగులో ఫ్లాప్. ఇక తమిళ, మలయాళ భాషల్లో డిజాస్టర్. వసూళ్ల సంఖ్య పరంగా చూస్తే… చాలా పెద్ద ఫిగరే వచ్చింది. కానీ.. ఏరియా వైజ్‌గా చేస్తే కొన్ని చోట్ల లాభాలు, మరికొన్నిచోట్ల నష్టాలను చూపింది. యూరివర్సల్‌గా అందర్నీ ఆకట్టుకోలేకపోయింది. నెక్ట్స్ సినిమా విషయంలో ఈ పొరపాట్లు జరగొద్దనే ఉద్ధేశ్యంతో.. దర్శకుడికి స్క్రిప్ట్‌లో ఛేంజస్ చేయమని చెప్పి పారిస్ వెళ్లాడట ప్రభాస్.

రెండు నెలల తర్వాతే ప్రభాస్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటాడట. వచ్చే ఏడాది ఆగస్ట్‌కి ఈ కొత్త సినిమాని రిలీజ్ చేస్తాడట. అలాగే.. మరో రెండు కొత్త సినిమాలను కూడా ఒప్పుకునేందుకు పలువురు దర్శకులతో చర్చలు జరపనున్నాడు సాహో స్టార్.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!