ప్ర‌భాస్‌, హృతిక్ కాంబోలో మ‌ల్టీ స్టార‌ర్‌?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇటీవ‌లే ఓ హిందీ డైరెక్ట‌ర్ తో సినిమా చేయ‌బోతున్నాడంటూ వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై బాలీవుడ్ లోనూ చ‌ర్చ న‌డుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ప్ర‌భాస్ చిత్రంలో ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో..

ప్ర‌భాస్‌, హృతిక్ కాంబోలో మ‌ల్టీ స్టార‌ర్‌?
Follow us

| Edited By:

Updated on: Jul 07, 2020 | 7:50 PM

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇటీవ‌లే ఓ హిందీ డైరెక్ట‌ర్ తో సినిమా చేయ‌బోతున్నాడంటూ వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై బాలీవుడ్ లోనూ చ‌ర్చ న‌డుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి వైర‌ల్ అవుతోంది. ప్ర‌భాస్ చిత్రంలో ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ న‌టిస్తున్నాడ‌ట‌. మ‌ల్టీస్టార‌ర్ చిత్రంగా, యాక్ష‌న్ నేప‌థ్యంలో రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందుకోసం ఎప్ప‌టినుంచే సన్నాహాలు మొద‌ల‌య్యాయ‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే ఈ సినిమాపై అధికారికంగా ఎటువంటి స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ త‌ర్వాత నాగ్ అశ్విన్ ద‌ర్వ‌క‌త్వంలో మ‌రో సినిమా చేస్తున్నాడు. వీటి త‌ర్వాతే హిందీలో చేయ‌నున్న చిత్రం ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. అయితే ప్ర‌స్తుతం దేనిపైనా ఎలాంటి క్లారిటీ రాలేదు. మ‌రి ఏ విష‌యం అనేది తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేంత వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.