ఐపీఎల్‌లో కోహ్లీని చేజార్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఎప్పుడంటే.?

విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరు ఒక బ్రాండ్. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగలిగిన సమర్ధుడు. ఇలాంటి ప్లేయర్ ఐపీఎల్ వేలంలోకి వస్తే ఫ్రాంచైజీలు ఎవరైనా కూడా కోట్లు పోసి కొంటారు.

ఐపీఎల్‌లో కోహ్లీని చేజార్చుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఎప్పుడంటే.?
Follow us

|

Updated on: Jun 29, 2020 | 1:43 PM

విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరు ఒక బ్రాండ్. ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించగలిగిన సమర్ధుడు. ఇలాంటి ప్లేయర్ ఐపీఎల్ వేలంలోకి వస్తే ఫ్రాంచైజీలు ఎవరైనా కూడా కోట్లు పోసి కొంటారు. అయితే ఇందుకు విరుద్ధంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ విరాట్ కోహ్లీ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ప్రదీప్ సంగ్వాన్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..

2008లో ఐపీఎల్ మొదటి సీజన్ మొదలైంది. అప్పుడు వేలం కాస్త విభిన్నంగా జరిగింది. సచిన్, సెహ్వాగ్, గంగూలీ వంటి సీనియర్ ఆటగాళ్లందరూ కూడా వేలంలో పాల్గొనడంతో.. ప్రతీ జట్టు కేవలం ఇద్దరు అండర్ 19 ప్లేయర్లను మాత్రమే ఎంపిక చేసుకోవడానికి అనుమతి ఉంది. ఇక ఆ సమయంలో విరాట్ కోహ్లీని దక్కించుకునే ఛాన్స్ ఢిల్లీకి వచ్చింది. కాని వారు అతని స్థానంలో పేసర్ ప్రదీప్ సంగ్వాన్‌ను తీసుకున్నారు.

దీనికి కారణం కూడా లేకపోలేదు. అప్పట్లో ఢిల్లీ జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, ఏబీ డివిలియర్స్ వంటి స్టార్ ప్లేయర్స్ ఉండటంతో ఫ్రాంచైజీ మెంబర్స్ బౌలర్ల వైపు మొగ్గు చూపారు. దీనితో బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు విరాట్ కోహ్లీని దక్కించుకుంది. ఆ తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ.. గత 12 సీజన్లుగా ఆ జట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తూ వచ్చాడు విరాట్ కోహ్లీ. కానీ ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేకపోయాడు.