Breaking News
  • ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. నిరాధార ఆరోపణలతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆత్మహత్యలకు కారణాలను దర్యాప్తు సంస్థలు తేల్చాల్సి ఉంది. చట్టప్రకారం చర్యలు చేపట్టాలని కార్మికశాఖ కమిషనర్‌ను ఇప్పటికే హైకోర్టు ఆదేశించిందన్న సీఎస్‌. కార్మికుల జీతాలు సహా ఇతర డిమాండ్లపై కార్మికశాఖ కమిషనర్‌ తగిన చర్యలు తీసుకుంటారన్న సీఎస్‌.
  • ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో భారీగా నిధుల దుర్వినియోగం. మాజీ సెక్రటరీ చౌదరి సహా కొందరు సభ్యులపై కేసు నమోదు. నిధులు దుర్వినియోగం అయినట్టు రుజువుకావడంతో పున్నయ్య చౌదరిని అరెస్ట్‌చేసిన పోలీసులు.
  • విజయవాడ: సీఎం జగన్‌ పాలనతో సహకారం రంగం విరాజిల్లుతోంది. 2004లో స్వర్గీయ వైఎస్‌ఆర్‌ కోఆపరేటివ్‌ వ్యవస్థను బలోపేతం చేశారు. సహకారం రంగాన్ని టీడీపీ ప్రభుత్వం కుదేలు చేసింది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాజకీయ నాయకుల లాగా ఉద్యోగులు యూనియన్లు మారొద్దు-మంత్రి పేర్ని నాని. సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతులకు అన్ని విధాలుగా సహకరించి రుణాలు అందించాలి-మంత్రి వెల్లంపల్లి
  • సిద్దిపేట: హుస్నాబాద్‌లో మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు. చన్నీళ్లతో స్నానం చేస్తున్నామని మంత్రికి విన్నవించిన విద్యార్థులు. వాటర్‌ హీటర్‌ను వెంటనే రిపేర్‌ చేయించాలని ప్రిన్సిపాల్‌కు ఆదేశం. పిల్లలకు త్వరలో దుప్పట్లు పంపిణీ చేస్తానని హామీ.
  • తిరుపతి: కేరళ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే రైలులో నీటి కొరత. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. నరక యాతన పడుతున్న అయ్యప్ప భక్తులు, ప్రయాణికులు. రైలును రేణిగుంట స్టేషన్‌లో ఆపేసిన ప్రయాణికులు.
  • మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం. పిటిషన్లన్నీ కొట్టివేయాలని సింగిల్‌ జడ్జిని కోరిన ప్రభుత్వం. పిటిషన్లపై ఇప్పటికే ధర్మాసనం విచారణ జరిపిందన్న ప్రభుత్వం. ప్రజా ప్రయోజన పిటిషన్లను ఇప్పటికే ధర్మాసనం కొట్టివేసిందన్న ప్రభుత్వం.
  • గుంటూరు: ఎస్పీ విజయరావుకు జనసేన ఫిర్యాదు. జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు. వాస్తవాలు పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ధర్మవరం ఘటనపై పూర్తి విచారణ చేపడతాం-ఎస్పీ విజయరావు. పోలీసులపై దాడి చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటాం. అనవసర వివాదాలకు గ్రామస్తులు దూరంగా ఉండాలి-ఎస్పీ విజయరావు.
  • తూ.గో: అంతర్వేది బీచ్‌లో చోరీ. కారులో నుంచి బంగారు నగలు ఎత్తుకెళ్లిన దుండగులు. నగల విలువ రూ.3 లక్షలు ఉంటుందన్న బాధితులు. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితుడు సూర్యనారాయణ.

నిఖిల్ ఈ సారైనా మాట నిలుపుకుంటాడా..!

delay in Nikhil Arjun Suravaram movie release, నిఖిల్ ఈ సారైనా మాట నిలుపుకుంటాడా..!

టాలీవుడ్‌‌లో మంచి పేరు సాధించిన యంగ్ హీరోల్లో నిఖిల్ ఒకడు. హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్.. ఆ తరువాత సినిమాలతో అంత మెప్పించలేకపోయాడు. అయితే స్వామి రారాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ఈ యంగ్ హీరో.. విభిన్న కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద మంచి మార్కెట్‌ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే గతేడాది ‘కిరాక్ పార్టీ’తో ప్రేక్షకులను పలకరించిన ఈ హీరో.. ఆ తరువాత టాలీవుడ్‌కు దూరమయ్యారు. కాగా ఈయన నటించిన మరో చిత్రం ఇప్పటివరకు విడుదలకు నోచుకోకపోవడం గమనర్హం.

నిఖిల్ హీరోగా ‘అర్జున్ సురవరం’ అనే చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. తమిళంలో విజయం సాధించిన కణిథన్ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కగా.. మాతృకలో దర్శకత్వం వహించిన టీఎన్ సంతోష్ తెలుగు రీమేక్‌ను డైరక్ట్ చేశారు. అయితే ఏ ముహూర్తాన ఈ మూవీ ప్రారంభమైందో కానీ.. అప్పటి నుంచి దీనికి బ్రేకుల మీద బ్రేకులు పడుతున్నాయి. ముందుగా ఈ మూవీ టైటిల్ విషయంలో పెద్ద వివాదమే జరిగింది. ఈ మూవీకి అప్పట్లో ‘ముద్ర’ అనే టైటిల్‌ను పెట్టారు. కానీ అదే పేరును మరో నిర్మాత ఫిలింనగర్‌లో రిజిస్టర్ చేయించడం.. ఆ విషయాన్ని ఆయన సుస్పష్టంగా వివరించడంతో.. చివరకు నిఖిల్ టీమ్ తలొగ్గి పేరును అర్జున్ సురవరంగా మార్చుకుంది. ఇక ఆ తరువాత ఈ మూవీ విడుదల డేట్ చెప్పిన ప్రతిసారి వాయిదా పడుతూనే వస్తోంది. అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న నిఖిల్.. ఈ సినిమాకు రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశాడు. నవంబర్ 8న అర్జున్ సురవరంను విడుదల చేయబోతున్నట్లు ఆయన ఆ షోలో వివరించారు. కానీ ఎందుకు లేటవుతుందో మాత్రం ఆయన వివరణ ఇవ్వలేదు. దీంతో ఈసారైనా నిఖిల్ తన మాటను నిలుపుకుంటాడేమో చూడాలంటూ కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పిస్తున్నప్పటికీ.. విడుదల విషయంలో డిలే జరుగుతూ రావడం గమనర్హం.

కాగా ఈ మూవీలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటించగా.. ఆయన సరసన లావణ్య త్రిపాఠి నటించింది. వెన్నెల కిశోర్, నాగినీడు, పోసాని కృష్ణ మురళి తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. ఠాగూర్ మధు సమర్పణలో రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. శ్యామ్ సీఎస్ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకున్న ఈ మూవీపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.