Breaking News
  • ప.గో: చింతలపూడి జెడ్పీ పాఠశాలలో లైంగిక వేధింపులు. మహిళా టీచర్‌ను లైంగికంగా వేధిస్తున్న తోటి టీచర్‌. డీఈవో, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసిన కలెక్టర్‌.
  • తిరుపతి: పలమనేరు అటవీప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల కేసు. 8 మందిపై కేసునమోదు, ఇప్పటికే పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు. నిందితులను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు ఏర్పాటు. కీలక నిందితుడు చెన్నైకి చెందిన స్వామీ జయచంద్రన్‌ కోసం గాలింపు. రుయాలో చికిత్సపొందుతున్న బాధితుడు గణేష్‌ పరిస్థితి విషమం. కాలిన గాయాలతో ఈ నెల 12న ఆస్పత్రిలో చేరిన గణేష్‌. గణేష్‌ను నరబలి ఇచ్చేందుకు యత్నించారంటున్న కుటుంబసభ్యులు. విద్యుత్‌షాక్‌తో గణేష్‌ ప్రమాదానికి గురయ్యాడంటున్న పోలీసులు.
  • టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి భూకబ్జా, కేసుల చిట్టా. 2016 జనవరి 13న రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై.. గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. గోపన్‌పల్లిలోని భూమిని కబ్జా చేసేందుకు.. ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై సెక్షన్‌ 447, 427, 506.. రెడ్‌విత్‌ 34, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసునమోదు. టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యల చార్జిషీట్‌. 16 మంది సాక్షులను విచారించిన గచ్చిబౌలి పోలీసులు. గోపన్‌పల్లిలోని సర్వేనెంబర్‌ 127లో భూకబ్జాకు ప్రయత్నించారు. అడ్డుకున్నందుకు బాధితులను బూతులు తిట్టినట్టు తేల్చిన పోలీసులు. సర్వేనెంబర్‌ 127లో తమకు చెందని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం. కోర్టులో 28 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు.
  • గోపన్‌పల్లి భూవివాదంపై స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ . కొండల్‌రెడ్డితో అప్పటి తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి కుమ్మక్కయ్యారు. గోపన్‌పల్లి భూ వివాదంలో అప్పటి తహశీల్దార్‌ అవకతవకలకు పాల్పడ్డారు. కొండల్‌రెడ్డికి సంబంధం లేని భూమిని శ్రీనివాస్‌రెడ్డి మ్యుటేషన్‌ చేయించారు. -టీవీ9తో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌. డిప్యూటీ తహశీల్దారు శ్రీనివాస్‌రెడ్డి తన అధికారాలకు విరుద్ధంగా.. రికార్డుల్లో లేనివ్యక్తి భూమిని కొండల్‌రెడ్డికి మ్యుటేషన్ చేయించారు. ఈ వివాదంలో మరో ఇద్దరు తహశీల్దార్ల పాత్ర కూడా గుర్తించాం. తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వానికి లేఖ రాశాం-టీవీ9తో రంగారెడ్డిజిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్.
  • గోపన్‌పల్లి భూవివాదంలో గతంలోనే రేవంత్‌రెడ్డిపై కేసులు. 2016 జనవరి 13న రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై.. గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. గోపన్‌పల్లిలోని భూమిని కబ్జా చేసేందుకు.. ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై సెక్షన్‌ 447, 427, 506.. రెడ్‌విత్‌ 34, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసునమోదు. టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యల చార్జిషీట్‌. 16 మంది సాక్షులను విచారించిన గచ్చిబౌలి పోలీసులు. గోపన్‌పల్లిలోని సర్వేనెంబర్‌ 127లో భూకబ్జాకు ప్రయత్నించారు. అడ్డుకున్నందుకు బాధితులను బూతులు తిట్టినట్టు తేల్చిన పోలీసులు. సర్వేనెంబర్‌ 127లో తమకు చెందని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం. కోర్టులో 28 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు.

యురేనియంపై ఫైట్.. బీజేపీ నేతల మౌనం.. అంతుబట్టని వైనం..!

Here is the reason why Telangana BJP silent on Uranium Mining Issue?, యురేనియంపై ఫైట్.. బీజేపీ నేతల మౌనం.. అంతుబట్టని వైనం..!

యురేనియం తవ్వకాలపై గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలు అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్న యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పలువురు గళం విప్పారు. పలు రాజకీయ పార్టీ నేతలతో పాటు సినీ ప్రముఖులు సేవ్ నల్లమల అంటూ అందరికీ పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో సంతకాల సేకరణలో భాగంగా ఎంతోమంది నటీనటులు, వేలాదిమంది సామాన్యులు పిటిషన్‌పై సంతకం చేశారు.

ఇక దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. యురేనియం తవ్వకాలకు తమ ప్రభుత్వం అనుమతిని ఇవ్వదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.  యురేనియం అనుమతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటీ అనుమతులు ఇవ్వలేదని, భవిష్యత్‌లో కూడా అనుమతులు ఇవ్వాలనే ఆలోచన లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్రంతో పోరాడేందుకు కూడా తాము సిద్ధమని కేసీఆర్ వెల్లడించారు. మరోవైపు యురేనియం తవ్వకాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మాణం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.

ఇదిలా ఉంటే మొదట యురేనియం తవ్వకాలకు తెలంగాణ వెలుగులోకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీసుకొచ్చారు. యురేనియం తవ్వకాల వలన పర్యావరణానికి, జీవజాలానికి, ప్రజలకు తీవ్ర నష్టం చేకూరుతుందని ఆ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి, వీహెచ్ సహా పలువురు అందరిలో సామాజిక స్పృహను తీసుకొచ్చారు. దీనికి వివిధ పార్టీ నేతలు కూడా తమ మద్దతును తెలిపారు. అలా పలికిన వారిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఒకరు. దీనిపై త్వరలోనే రాజకీయవేత్తలు, మేధావులు, నిపుణులు, పర్యావరణ ప్రేమికులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని వివరించారు. అయితే ఇంత జరుగుతున్నా తెలంగాణకు చెందిన బీజేపీ కీలక నేతలు ఈ సమస్యపై నోరు విప్పకపోవడం గమనర్హం.

నిజానికి చెప్పాలంటే దేశంలో ఎక్కడైనా ఏదైనా ముడి ఖనిజం ఉందని తేలితే అక్కడ అన్వేషణ చేసే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అటామిక్ మినరల్ డైరక్టరేట్(ఏఎమ్‌డీ) పర్యవేక్షణలో జరుగుతుంది. ఇక అన్వేషణ తరువాత ఆ ప్రాంతంలో మైనింగ్‌ చేయాలనుకుంటే దానికి కచ్చితంగా రాష్ట్రప్రభుత్వం ఆమోదం లభించాలి. ఒకవేళ మైనింగ్‌కు రాష్ట్రప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే.. ఆ తరువాత యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ అక్కడ మైనింగ్ చేపట్టే అవకాశం ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే ఏ రాష్ట్రంలోనైనా ఖనిజం మైనింగ్ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతే ఎక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉండటంతో.. ఈ వివాదంపై రాష్ట్రంలోని బీజేపీ నేతలు తమ గొంతును వినిపించలేదని సమాచారం. ఏది ఏమైనా మైనింగ్‌కు అనుమతి ఇవ్వమని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ సుస్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పటికైనా యురేనియం ఫైట్‌కు ఫుల్‌స్టాప్ పడుతుందేమో చూడాలి.

Related Tags