Breaking News
  • కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో శానిటైజర్‌, మాస్క్‌లు ఉపయోగించాలని తెలిపారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌. వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. అలాగే పోలీసు వాహనాలను ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేయాలని ఆదేశించారు.
  • విశాఖలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15కు చేరింది. అక్కయ్యపాలెం, తాటిచెట్ల పాలెం, ఐటీ జంక్షన్‌ ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. ఇటు ఇంటింటి సర్వేలు కూడా కొనసాగుతున్నాయి. 261 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 164కు చేరింది. ఇందులో 140 కేసులు ఢిల్లీ నుంచి వచ్చిన వారు, వారితో కాంటాక్టు అయిన వారివే! పాజిటివ్‌ కేసులుగా నమోదైన వారిలో ఇప్పటి వరకు నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా నెల్లూరులో నమోదయ్యాయి.
  • కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న అమెరికాలో తెలుగువారికీ ఇబ్బందులు తప్పడంలేదేు. చాలా మంది ఇళ్ల నుంచే పని చేసుకుంటున్నారు. పిల్లలకు ఆన్ లైన్ లోనే తరగతులు, పరీక్షలు జరుగుతున్నాయి. బయట మార్కెట్లు మూత పడిన నేపథ్యంలో ఉన్న సరుకులతోనే సర్ధుకుంటున్నారు.
  • కరోనా బారిన పడి మరణించిన వారిలో 95 శాతం వృద్ధులే ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. వీరిలో సగం మంది 80 ఏళ్ల వయసు దాటినవారేనని తెలిపింది. అందులో కూడా హృద్రోగం, అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారే ఎక్కువగా ఉన్నారని గుర్తించింది. 50 ఏళ్లలోపు కొవిడ్ 19 వైరస్ బాధితుల్లో ఒక మోస్తారుగా వ్యాధి లక్షణాలు అధికంగా ఉన్నట్లు కూడా నిర్ధారించారు.

బాబాయ్- అబ్బాయిలతో ఆడిపాడిన హీరోయిన్లు వీరే

actresses who worked with actors of two generations, బాబాయ్- అబ్బాయిలతో ఆడిపాడిన హీరోయిన్లు వీరే

టాలీవుడ్‌లో అక్కినేని కుటుంబం మినహా.. మిగిలిన ప్రతి టాప్ ఫ్యామిలీలోనూ బాబాయి- అబ్బాయిలు ఉన్నారు. మెగా ఫ్యామిలీలో పవన్ కల్యాణ్- రామ్ చరణ్, నందమూరి కుటుంబంలో బాలకృష్ణ- ఎన్టీఆర్, దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్- రానాలు ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఈ బాబాయి- అబ్బాయిలు కలసి ఒక్క సినిమాలోనైనా నటించాలని వారి వారి అభిమానులు ఎప్పటి నుంచో తమ కోరికను వెలిబుచ్చుతున్నారు. అయితే ఇంతవరకు ఆ కోరికను ఏ దర్శకుడు నెరవేర్చలేదు.(రానా కృష్ణం వందే జగద్గురంలో వెంకటేష్ కెమెరా అప్పియరెన్స్ మాత్రమే ఇచ్చారు). ఇదంతా పక్కనపెడితే టాలీవుడ్‌లోని కొంతమంది హీరోయిన్లు మాత్రం బాబాయి- అబ్బాయి ఇద్దరితో జత కట్టారు. ఇక ఏఏ హీరోయిన్ ఇలా బాబాయి- అబ్బాయితో కలిసి నటించిందో ఓ సారి చూద్దాం.
actresses who worked with actors of two generations, బాబాయ్- అబ్బాయిలతో ఆడిపాడిన హీరోయిన్లు వీరే

కాజల్ అగర్వాల్: రామ్ చరణ్‌ మగధీరతో మొదటిసారిగా మెగా ఫ్యామిలీ హీరోతో జోడీ కట్టిన కాజల్.. ఆ తరువాత అతడితోనే నాయక్, గోవిందుడు అందరివాడేలే చిత్రాల్లో మెరిసింది. ఇక చెర్రీ బాబాయి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సరసన ఈ చందమామ ‘సర్ధార్ గబ్బర్‌ సింగ్‌’లో కనిపించింది.

తమన్నా: రామ్ చరణ్‌తో రచ్చ సినిమాలో కనిపించిన మిల్కీ బ్యూటీ తమన్నా.. పవన్ కల్యాణ్‌తో కెమెరామన్ గంగతో రాంబాబులో ఆడిపాడింది. అంతేకాదు ఈ ఇద్దరు మెగా ఫ్యామిలీలోని టాప్ హీరోలైన చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌, చరణ్‌లతో జోడీ కట్టి.. అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే.

సమంత: పవన్ కల్యాణ్‌తో అత్తారింటికి దారేదిలో నటించిన సమంత.. ఆ తరువాత రామ్ చరణ్‌ సరసన రంగస్థలంలో ఆడిపాడింది.

actresses who worked with actors of two generations, బాబాయ్- అబ్బాయిలతో ఆడిపాడిన హీరోయిన్లు వీరే

నయనతార: ఎన్టీఆర్ సరసన అదుర్స్‌లో నటించిన నయనతార.. ఆ తరువాత బాలకృష్ణతో శ్రీరామ రాజ్యం, సింహా, జై సింహా ఇలా హ్యాట్రిక్ చిత్రాల్లో నటించింది.

ప్రియమణి: ఎన్టీఆర్ సరసన యమదొంగలో ఆడిపాడిన ప్రియమణి.. ఆ తరువాత మిత్రుడులో బాలకృష్ణతో కలిసి నటించింది.

త్రిష: ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దమ్ములో నటించిన త్రిష.. ఆ తరువాత బాలయ్యతో లయన్ సినిమాలో ఆడిపాడింది.

ఛార్మీ: బాలయ్య సరసన అల్లరి పిడుగు అనే చిత్రంలో నటించిన ఛార్మీ.. ఆ తరువాత రాఖీ సినిమాలో ఎన్టీఆర్‌తో జత కట్టింది.

శ్రియ: ఎన్టీఆర్ సరసన నా అల్లుడులో కనిపించిన శ్రియ.. బాలకృష్ణతో చెన్నకేశవ రెడ్డి, పైసా వసూల్, గౌతమీ పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడులో నాలుగు సార్లు జోడీ కట్టింది.

ఆర్తీ అగర్వాల్: ఎన్టీఆర్ సరసన అల్లరి రాముడులో కనిపించిన ఆర్తీ అగర్వాల్.. ఆ తరువాత బాలకృష్ణ సరసన పల్నాటి బ్రహ్మనాయుడులో కనిపించింది. అంతేకాదు ఎన్టీఆర్ చిత్రం నరసింహనాయుడులోనూ ఓ స్పెషల్ పాటలో మెరిసింది.

హన్సిక: ఎన్టీఆర్ సరసన కంత్రిలో నటించిన హన్సిక.. బాలకృష్ణ‌తో ఎన్టీఆర్ కథానాయకుడులో జయప్రద పాత్రలో లీనమైంది.

రకుల్ ప్రీత్ సింగ్: ఎన్టీఆర్ సరసన నాన్నకు ప్రేమలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్.. బాలకృష్ణతో ఎన్టీఆర్ కథానాయకుడులో శ్రీదేవి పాత్రలో అతడి సరసన ఆడిపాడింది.

నిత్యా మీనన్: ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రంలో నటించిన నిత్యా మీనన్.. బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడులో సావిత్రి పాత్రకు జీవం పోసింది.

భూమిక: ఎన్టీఆర్‌తో సింహాద్రి, సాంబ సినిమాలో కనిపించిన భూమిక.. ఇప్పుడు బాలకృష్ణ 105వ చిత్రంలో ఆయనతో కలిసి నటిస్తోంది.

సంఘవి: బాలకృష్ణతో గొప్పింటి అల్లుడు అనే చిత్రంలో కనిపించిన సంఘవి.. ఎన్టీఆర్ ఆంధ్రావాలాలో నటించింది.
ఇక బాలకృష్ణతో నటించిన రమ్యకృష్ణ, రంభ లాంటి వారు కూడా ఎన్టీఆర్‌‌తో స్పెషల్ సాంగ్‌లలో మెప్పించారు.

actresses who worked with actors of two generations, బాబాయ్- అబ్బాయిలతో ఆడిపాడిన హీరోయిన్లు వీరే

నయనతార: వెంకటేష్ సరసన లక్ష్మీ, తులసీ, బాబు బంగారం చిత్రాల్లో నటించిన లేడీ సూపర్‌స్టార్ నయనతార.. రానా సరసన కృష్ణం వందే జగద్గురుంలో కనిపించింది.

అనుష్క: వెంకటేష్ సరసన చింతకాయల రవిలో కలిసి నటించిన అనుష్క.. రుద్రమదేవిలో రానాతో ఆడిపాడింది.

జెనీలియా: వెంకటేష్ సరసన సుభాష్ చంద్రబోస్‌లో నటించిన జెనీలియా.. రానాతో నా ఇష్టంలో జోడీ కట్టింది.

తాప్సీ: వెంకటేష్ సరసన షాడోలో కనిపించిన ఈ ఢిల్లీ బ్యూటీ.. రానా ప్రధానపాత్రలో వచ్చిన ఘాజీలో ఓ పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే.

Related Tags