Breaking News
  • దేశంలో కరోన బాధితుల సంఖ్య 4789కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 4312 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 352మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 124 మంది మృతి. సాయంత్రం 6.00 గంటల వరకు వివరాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ. గడచిన 24 గంటల్లో 508 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13మంది మృతి.
  • శరవేగంగా రూపుదిద్దుకున్న గచ్చిబౌలి ఐసోలేషన్‌ సెంటర్‌. అత్యాధునిక ఐసోలేషన్‌ సెంటర్‌గా గచ్చిబౌలి స్పోర్ట్స్‌ విలేజ్‌. అంతర్జాతీయ స్థాయిలో కరోనా ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను తలపించేలా ఉన్న సదుపాయాలు. మొత్తం 14 అంతస్తుల భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వెంటిలేటర్‌ సదుపాయం. ఇప్పటికే మూడు అంతస్తుల్లో 1,500 బెడ్స్‌ సిద్ధం. ఒక్కో ఫ్లోర్‌కు 36 గదులు, ప్రతి గదిలో 2 బెడ్స్‌. మరో 11 ఫ్లోర్లు శరవేంగా సిద్ధం చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ. రోజుకు 24 గంటలు 1,200 మంది వైద్య సిబ్బంది విధులు. ఉస్మానియా ఆస్పత్రికి అనుసంధానంగా పని చేయనున్న గచ్చిబౌలి ఐసోలేషన్‌ సెంటర్‌.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తం అయ్యింది.. విదేశాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానితులందరినీ ఇప్పటికే క్వారంటైన్, ఐషోలేషన్ కేంద్రాలకు తరలించిన అధికారులు.. ఇంటింటి సర్వేను కూడా మరోసారి వేగవంతం చేశారు.
  • భారత్‌ దగ్గర సరిపడ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఉంది. లాక్‌డౌన్‌ పొడిగింపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు-లవ్‌ అగర్వాల్‌.
  • లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం. లాక్‌డౌన్‌ పొడిగించాలని కేంద్రంపై వివిధ రాష్ట్రాల ఒత్తిడి. లాక్‌డౌన్‌ పొడిగించాలని ఇప్పటికే ప్రధాని మోదీని కోరిన తెలంగాణ సీఎం కేసీఆర్‌. కేసీఆర్‌ బాటలో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ఠాక్రే. లాక్‌డౌన్‌ను పొడిగించాలిన కేంద్రాన్ని కోరిన యూపీ సర్కార్‌.

మీ రైలు టికెట్‌ను మరొకరి పేరుకు మార్చుకోవచ్చు.. ఎలాగంటే?

Easy Way To Change Name On IRCTC E Ticket, మీ రైలు టికెట్‌ను మరొకరి పేరుకు మార్చుకోవచ్చు.. ఎలాగంటే?

ఎక్కడికైనా వెళ్ళడానికి మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారా.? సడన్‌గా ఆ జర్నీ ప్లాన్ ఛేంజ్ అయిందా.? అయితే మీరు బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకోకుండా వేరొకరి పేరు మీదకు సింపుల్‌గా మార్చుకోవచ్చు. దీని కోసం మీరు రైల్వే రిజర్వేషన్ ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ‘ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్’ ప్రింట్ అవుట్‌తో పాటుగా ఒరిజినల్ ఫోటో ఐడీను తీసుకుని రైలు బయల్దేరడానికి 24 గంటల ముందే రైల్వే ఆఫీస్‌కు చేరుకోవాలి.

పేరు మార్చడానికి రైల్వే కౌంటర్లో బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఏ విధమైన నిబంధనలు వర్తిస్తాయో.. ఈ- టికెట్‌కు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి. సదరు ప్యాసింజర్… రైలు బయల్దేరే 24 గంటలు ముందు సమీపంలోని రైల్వే రిజర్వేషన్ ఆఫీస్‌లో రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలి. ఇక ఆ టికెట్‌ను ప్యాసింజర్ కుటుంబానికి మాత్రమే బదిలీ చేస్తారు తప్ప మరింకెవరికి మార్చారు.

రైలు టికెట్‌ను కుటుంబ సభ్యుల్లో ఒకరికి బదిలీ చేయాలనుకున్నప్పుడు  ‘ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్’ ప్రింట్‌తో పాటు ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డ్ తీసుకెళ్లాలి. ఎవరి పేరుకు మార్చాలనుకుంటున్నారో.. అతనికి, మీకు ఉన్న సంబంధాన్ని ధృవీకరించే ప్రూఫ్ ఒకదాన్ని మీ వెంట తీసుకువెళ్లాలి.

Related Tags