తక్కువ ధరకు గోల్డ్ కావాలా.. అయితే ఈ రూపంలో కొనండి..!

బంగారం.. ఇది మన భారతీయులకు విలువైన ఆస్తి. అంతేకాదు… బంగారంతో భారతీయులకు ఓ భావోద్వేగమైన సంబంధం ఉంటుంది. తమ సంస్కృతీసంప్రదాయాల్లో బంగారానికి ఓ విశిష్ట చోటు కల్పిస్తారు భారతీయులు. అయితే అలాంటి బంగారం ఇప్పుడు కొనాలంటే చుక్కలు చూపుతోంది. సామాన్యుడు కొనేందుకు వీలులేకుండా పరుగులు పెడుతోంది. కొద్ది రోజుల క్రితం రూ.33 వేలు ఉన్న ధర.. ప్రస్తుతం రూ.39 వేల వరకు పెరిగింది. అంతేకాదు ఇది అరలక్ష దాటే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే […]

తక్కువ ధరకు గోల్డ్ కావాలా.. అయితే ఈ రూపంలో కొనండి..!
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2019 | 7:27 PM

బంగారం.. ఇది మన భారతీయులకు విలువైన ఆస్తి. అంతేకాదు… బంగారంతో భారతీయులకు ఓ భావోద్వేగమైన సంబంధం ఉంటుంది. తమ సంస్కృతీసంప్రదాయాల్లో బంగారానికి ఓ విశిష్ట చోటు కల్పిస్తారు భారతీయులు. అయితే అలాంటి బంగారం ఇప్పుడు కొనాలంటే చుక్కలు చూపుతోంది. సామాన్యుడు కొనేందుకు వీలులేకుండా పరుగులు పెడుతోంది. కొద్ది రోజుల క్రితం రూ.33 వేలు ఉన్న ధర.. ప్రస్తుతం రూ.39 వేల వరకు పెరిగింది. అంతేకాదు ఇది అరలక్ష దాటే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం కొంచెం తక్కువ ధరకి కొనిపెట్టుకోవాలనుకుంటున్న వారికి కేంద్ర ఓ శుభవార్త తెలిపింది. మరోసారి సావరిన్ గోల్డ్ బాండ్లను విక్రయించబోతోంది. దీంతో దసరా, దీపావళికి బంగారం కొని ఇన్వెస్ట్‌మెంట్‌గా పెట్టాలనుకున్న వారికి మంచి అవకాశం లభించింది. అక్టోబర్‌ 7వ తేదీన సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019 -20 సిరీస్‌ 5కు శ్రీకారం చుట్టింది. అయితే ఈ సారి ఒక గ్రామ్ పసిడి ధర రూ.3,788గా నిర్ణయించింది. అక్టోబర్‌ 7 నుంచి 11వ తేదీ వరకూ ఈ స్కీమ్‌ అందుబాటులో ఉంటుంది. అయితే ఆన్‌లైన్‌ అప్లై చేసినా, డిజిటల్‌ రూపంలో చెల్లింపులు జరిపిన ఇన్వెస్టర్లకు రూ.50 డిస్కౌంట్‌ కూడా ఉంటుంది. అంటే వీరికి 3,738కే గ్రాము బాండ్‌ అందుబాటులో ఉంటుందన్నమాట.

భౌతికపరమైన పసిడి డిమాండ్‌ తగ్గింపు, తద్వారా దేశీయ పొదుపుల పెంపు లక్ష్యంగా 2015 నవంబర్‌లో కేంద్రం ఈ సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా వ్యక్తిగతంగా ఒకరు ఒక ఆర్థిక సంవత్సరంలో 500 గ్రాముల వరకూ విలువైన పసిడి బాండ్లను కొనుగోలు చేసే వీలుంది. హిందూ అవిభక్త కుటుంబం 4 కేజీల వరకూ కొనుగోలు చేయవచ్చు. ఇక ట్రస్టీల విషయంలో 20 కేజీల వరకు కొనగోలు చేసే వీలుంది.

సావరిన్ గోల్డ్ బాండ్స్ ఎవరికి ఇస్తారంటే..

ఈ సావరిన్ బాండ్లను భారతీయులు, లేదా భారతీయ సంస్థలకు మాత్రమే ఇస్తారు. ఒక్క వ్యక్తి కనీసం ఒక గ్రాము నుంచి 500 గ్రాముల వరకు మాత్రమే కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ బాండ్స్ రూపంలో పెట్టుబడి పెట్టాలనుకనే వారు.. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో నిర్థేశించిన పోస్టాఫీసుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ పొందిన ఏజెంట్స్ ఇందుకు ఏజెంట్స్ గా వ్యవహరిస్తారు. బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి దరఖాస్తులను సేకరిస్తారు. ఈ పసిడి బాండ్లను ఆర్బీఐ తరఫున భారత ప్రభుత్వం జారీ చేస్తుంది. జారీ చేసిన బాండ్స్‌ని బ్యాంకులు, లేదా పోస్టాఫీసుల నుంచి పంపిణీ చేస్తారు.

బాండ్స్‌పై వడ్డీ కూడా..

ఈ సావరిన్ బాండ్లు.. డిమాట్, పేపర్ రూపంలో ఉంటాయి. వీటి కాల పరిమితి ఎనిమిదేళ్లు. అయితే ఐదేళ్ల తరువాత ఈ పథకం నుంచి ఇన్వెస్టర్ వైదొలగవచ్చు. ఈ బాండ్లపై ఏటా 2.5శాతం వడ్డిని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆర్బీఐ నోటిఫై చేసిన తేదీ నుంచి ఈ గోల్డ్ బాండ్లు స్టాక్ ఎక్సైంజ్‌లో ట్రేడింగ్‌లో కొనసాగుతాయి. దీనిపై రుణాలు కూడా పొందవచ్చు.

బాండ్ల రూపంలో తీసుకోవడం ద్వారా ప్రయోజనాలెన్నో..

పసిడి కోసం పెట్టిన పెట్టుబడికి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. మీరు తిరిగి తీసుకునేటప్పుడు మార్కెట్ ధర ఎంత ఉంటే అంత చెల్లించబడుతుంది. అంతేకాదు బాండ్స్ రూపంలో ఉండడం వల్ల మేకింగ్ చార్జీలు, నాణ్యత వంటి సమస్యలు ఉండవు. పైగా ప్రతి ఏటా వడ్డీ కూడా వస్తుంది.

పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి?
పిల్లలకు ఏ వయసు నుంచి గుడ్డు తినిపించాలి?
మొనగాడొచ్చాడు సామీ.. ఇక ఆ ముగ్గురు తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే..
మొనగాడొచ్చాడు సామీ.. ఇక ఆ ముగ్గురు తట్టాబుట్టా సర్డుకోవాల్సిందే..
ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉండబోతుందో చెప్పిన మనోజ్ బాజ్‌పాయ్
ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలా ఉండబోతుందో చెప్పిన మనోజ్ బాజ్‌పాయ్
వారంలో 3 రోజులు అవే తింటున్నారా? అయితే మీ కన్నా తాగుబోతులే బెటర్
వారంలో 3 రోజులు అవే తింటున్నారా? అయితే మీ కన్నా తాగుబోతులే బెటర్
చదివింది టెన్త్ క్లాస్! నకిలీ ఓటరు, ఆధార్‌ కార్డుల తయారీలో జాదు..
చదివింది టెన్త్ క్లాస్! నకిలీ ఓటరు, ఆధార్‌ కార్డుల తయారీలో జాదు..
ఒప్పో నుంచి బడ్జెట్‌ ఫోన్.. తక్కువ ధరలోనే సూపర్‌ ఫీచర్స్‌
ఒప్పో నుంచి బడ్జెట్‌ ఫోన్.. తక్కువ ధరలోనే సూపర్‌ ఫీచర్స్‌
సమ్మర్‌లో గుడ్లు తింటే ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా? డోంట్ మిస్..
సమ్మర్‌లో గుడ్లు తింటే ఇన్ని సైడ్ ఎఫెక్ట్సా? డోంట్ మిస్..
'నా కొడుకుకు ప్రాణ హాని ఉంది'.. మాజీ ఎమ్మెల్యే షకీల్..
'నా కొడుకుకు ప్రాణ హాని ఉంది'.. మాజీ ఎమ్మెల్యే షకీల్..
మహేష్ బాబు ఆ సినిమా కోసం బ్లాక్‌లో టికెట్స్ కొని మరీ చూశారట..
మహేష్ బాబు ఆ సినిమా కోసం బ్లాక్‌లో టికెట్స్ కొని మరీ చూశారట..
రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి పడుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి పడుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..
100కోట్లు కొల్లగొట్టిన సినిమా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు..