టాలీవుడ్ హీరోయిన్ల టాప్ 10 రెమ్యునరేషన్స్ ఇవే..! 

కమర్షియల్ సినిమా అయినా.. సామాజిక సందేశం ఉన్నదైనా.. హీరోయిన్లకు తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. వారికి ఆయా సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ పోషించినా.. హీరో డామినేషన్ వల్ల పెద్దగా పేరు రాదు. అలాంటి తరుణంలో కొంతమంది హీరోయిన్లు అందం, అభినయంతో చాలా ఏళ్ళ నుంచి ఇండస్ట్రీని ఏలుతూ టాప్ హీరోయిన్లుగా స్థిరపడ్డారు. ఇక వారిలో కొంతమంది హీరోయిన్ల పారితోషికాల గురించి ఒకసారి పరిశీలిస్తే.. నయనతార.. ఈ భామ దశాబ్దన్నర కాలంగా సౌత్‌‌లో ఎదురులేని లేడి సూపర్‌స్టార్‌గా వెలిగిపోతోంది. అగ్ర హీరోలందరికీ […]

టాలీవుడ్ హీరోయిన్ల టాప్ 10 రెమ్యునరేషన్స్ ఇవే..! 
Follow us

|

Updated on: Sep 25, 2019 | 1:59 PM

కమర్షియల్ సినిమా అయినా.. సామాజిక సందేశం ఉన్నదైనా.. హీరోయిన్లకు తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. వారికి ఆయా సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ పోషించినా.. హీరో డామినేషన్ వల్ల పెద్దగా పేరు రాదు. అలాంటి తరుణంలో కొంతమంది హీరోయిన్లు అందం, అభినయంతో చాలా ఏళ్ళ నుంచి ఇండస్ట్రీని ఏలుతూ టాప్ హీరోయిన్లుగా స్థిరపడ్డారు. ఇక వారిలో కొంతమంది హీరోయిన్ల పారితోషికాల గురించి ఒకసారి పరిశీలిస్తే..

నయనతార.. ఈ భామ దశాబ్దన్నర కాలంగా సౌత్‌‌లో ఎదురులేని లేడి సూపర్‌స్టార్‌గా వెలిగిపోతోంది. అగ్ర హీరోలందరికీ నయన్‌నే ఏకైక ఆప్షన్.. అందుకే ఆమె అడిగినంతా ఇచ్చి.. ఒక్కోసారి బ్రతిమాలుకుని మరీ పారితోషికాలు అందిస్తుంటారు మన నిర్మాతలు. మెగాస్టార్ చిరంజీవితో పాటుగా బాలకృష్ణ, వెంకటేష్, అజిత్, విజయ్, రజినీకాంత్ వంటి టాప్స్ స్టార్ల సరసన నటిస్తోంది నయన్. అటు ఆమె సోలోగా సినిమా చేసినా.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ అదిరిపోతుంటాయి. ఇకపోతే ‘సైరా’ సినిమాకు ఆమె 6 కోట్ల పారితోషికం అందుకుంటోందన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇక మరో హీరోయిన్ అనుష్క ఒక్కో సినిమాకు రూ 3.5కోట్ల నుంచి 4 కోట్లు తీసుకుంటుందని వినికిడి. అటు ముంబై భామ పూజా హెగ్డే హవా టాలీవుడ్‌లో విపరీతంగా ఉందని చెప్పొచ్చు. ఆమె ఒక్కో చిత్రానికి రూ.2 కోట్లు వెనకేసుకుంటోందని సమాచారం. మరో బ్యూటీ కియారా అద్వానీ కూడా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు కమిట్ అవుతూ రూ.3 కోట్ల రెమ్యునరేషన్‌ను ఖాతాలో వేసుకుంటోందట. ఇక హీరోయిన్ తమన్నా ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 12 ఏళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ స్టార్ ఇమేజ్ కొన‌సాగిస్తోంది. సినిమాకు కోటిన్న‌ర నుంచి రెండు కోట్ల వ‌రకు చార్జ్ చేస్తుంది చంద‌మామ‌.

‘మహానటి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ సినిమాకొచ్చి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వినికిడి. మరోవైపు అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ వరుసగా ప్లాప్స్ చవి చూడటంతో.. ఆమె పారితోషికం రేంజ్ కోటి నుంచి 50 లక్షలకు పడిపోయిందని చెప్పుకుంటున్నారు. నయన్ మాదిరిగానే సోలోగా సినిమాను భుజస్కంధాలపై మోస్తున్న సమంత ఒక్కో సినిమాకు రూ. 2 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మజిలీ, ఓ బేబి సినిమాలతో వరుస హిట్స్ సాధించిన సమంత తన పారితోషికాన్ని పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇకపోతే హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి కోటిన్నర వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇదంతా ఫిల్మ్‌నగర్ రూమర్లు మాత్రమే.