మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ హిట్ దగ్గరే ఆగిపోడానికి రీజన్స్ ఏంటి?

‘సైరా’ నరసింహారెడ్డి..మూవీ పాజిటీవ్ టాక్ అందుకుంది. చిరును సిల్వర్ స్రీన్‌పై చూసి ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. కాకపోతే చిరు డ్రీమ్ ఫ్రాజెక్ట్..ఆయన రేంజ్‌కి తగ్గట్టుగా లేదని కొందరు పెదవివిరుస్తున్నారు. భారతదేశవ్యాప్తంగా బెస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేసినా కూడా అవుట్ పుట్ సంతృప్తికరంగా లేదన్నది వారి వాదన. మగధీర, ఈగ, బాహుబలి సినిమాలను కొలమానం తీసుకుంటే ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. మెగాస్టార్ కొన్ని ఏళ్లగా మనసుపడ్డ చిత్రం..ప్రేక్షకులు ఊహించుకున్న స్థాయికి కంటెంట్ రీచ్ అవ్వలేకపోవడానికి మెయిన్‌గా రీజన్స్ […]

మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ హిట్ దగ్గరే ఆగిపోడానికి రీజన్స్ ఏంటి?
Follow us

|

Updated on: Oct 05, 2019 | 8:08 AM

‘సైరా’ నరసింహారెడ్డి..మూవీ పాజిటీవ్ టాక్ అందుకుంది. చిరును సిల్వర్ స్రీన్‌పై చూసి ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. కాకపోతే చిరు డ్రీమ్ ఫ్రాజెక్ట్..ఆయన రేంజ్‌కి తగ్గట్టుగా లేదని కొందరు పెదవివిరుస్తున్నారు. భారతదేశవ్యాప్తంగా బెస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేసినా కూడా అవుట్ పుట్ సంతృప్తికరంగా లేదన్నది వారి వాదన. మగధీర, ఈగ, బాహుబలి సినిమాలను కొలమానం తీసుకుంటే ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. మెగాస్టార్ కొన్ని ఏళ్లగా మనసుపడ్డ చిత్రం..ప్రేక్షకులు ఊహించుకున్న స్థాయికి కంటెంట్ రీచ్ అవ్వలేకపోవడానికి మెయిన్‌గా రీజన్స్ వినిపిస్తున్నాయి.

అవి కావాల్సినవే కానీ..ఫస్ట్  హాప్ సాగదీత సాగుతూ ఉండటం కొందరు ప్రేక్షకుల్ని నిరాశపర్చింది.  సైరాలో వాస్తవికతకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. కల్పిత గాథతో హీరోయిజాన్ని ఎక్కువ ఎలివేట్ చేసేందుకు కష్టపడ్డరని సమాచారం. కల్పితకథలైతే.. అనేక ఎలిమెంట్స్ చూపించవచ్చునని, కానీ.. ఒక యోధుడి జీవిత చరిత్రను అలా ఇష్టారీతిన మార్చుకోవడం సాధ్యం కాదని, ఈ విషయాన్ని ప్రేక్షకులు కూడా గమనించాలని పలువురు సూచిస్తున్నారు. అంతేకాదు ‘సైరా’ బాహుబలిని మించిందిగా ఉండాలి…టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ది చెందుతోంది. కానీ వీఎఫ్ఎక్స్ విషయంలో టీం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హంగుకోసం.. భారీ తారాగణాన్ని ఎంచుకున్నారు. కానీ అది పబ్లిసిటి కోసం పోస్టర్స్ మీద ఉపయోగపడింది తప్ప సినిమాలో మాత్రం అంతగా ఉపయోగపడలేదని సాధారణ సిని అభిమానుల టాక్. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్న..వంటి భారీ స్టార్ కాస్ట్ తో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ నిర్మించిన అత్యంత భారీ సినిమా సైరా నరసింహా రెడ్డి లో సరిగ్గా ఒక్క పాత్ర కూడా కొన్నేళ్ళ పాటు చెప్పుకునే పాత్ర ఒక్కటి లేకపోవడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాలి.

మరి తెర మీద అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్న, నయనతారా ఉన్నారు కదా..వారిని ఉపయోగించుకోవడంతో దర్శకుడు కాస్త తడబడ్డాడనే వాదన వినిపిస్తోంది. అదే బాహుబలి సినిమా చూస్తే మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి గా రెండు పాత్రల్లో ప్రభాస్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. అలాగే రానా దగ్గుబాటి భల్లాలదగా పెద్ద క్రేజ్ వచ్చింది. ఇక ముఖ్యంగా శివగామిగా రమ్యకృష్ణ ను తప్ప మరెవరిని ఊహించుకోలేనంతగా ఆ పాత్ర ఫేమస్ అయింది. అనుష్క, తమన్న, కట్టప్ప గా సత్యరాజ్, నాజర్, కాలకేయుడిగా ప్రభాకర్..ఇలా ముఖ్య పాత్రలన్ని బాహుబలి సినిమా పేరు తలుచుకుంటేనే కళ్ళ ముందు కనపడతాయి. వీరందరూ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఏది ఏమైనా..ఇంకాస్త వర్కవుట్ అయి ఉంటే చిరు స్థాయి మరింత రెట్టింపయ్యేది.