వైజాగ్ గ్యాస్ లీకేజ్ .. బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

వైజాగ్‌లోని ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి లీకైన స్టెరీన్‌ వాయువు కారణంగా ఇప్పుడు కనిపిస్తున్న మహా విషాదం భోపాల్ దుర్ఘటన కంటే భయంకరంగా ఉంది. ఈ గ్యాస్ లీకేజ్ కారణంగా సుమారు ఐదు గ్రామాల ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఉదయం నిద్ర నుంచి లేస్తూనే తెలుగు ప్రజలను ఒక్కసారిగా కుదిపేసిన ఈ ఘటన సుమారు 36 ఏళ్ల కిందట భోపాల్‌‌‌‌లో సంభవించిన అత్యంత భయంకరమైన పారిశ్రామిక దుర్ఘటనను మరోసారి గుర్తు చేసింది. అప్పట్లో భోపాల్ […]

వైజాగ్ గ్యాస్ లీకేజ్ .. బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!
Follow us

|

Updated on: May 07, 2020 | 3:00 PM

వైజాగ్‌లోని ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి లీకైన స్టెరీన్‌ వాయువు కారణంగా ఇప్పుడు కనిపిస్తున్న మహా విషాదం భోపాల్ దుర్ఘటన కంటే భయంకరంగా ఉంది. ఈ గ్యాస్ లీకేజ్ కారణంగా సుమారు ఐదు గ్రామాల ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ఉదయం నిద్ర నుంచి లేస్తూనే తెలుగు ప్రజలను ఒక్కసారిగా కుదిపేసిన ఈ ఘటన సుమారు 36 ఏళ్ల కిందట భోపాల్‌‌‌‌లో సంభవించిన అత్యంత భయంకరమైన పారిశ్రామిక దుర్ఘటనను మరోసారి గుర్తు చేసింది.

అప్పట్లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన నుంచి వెలువడిన 40 టన్నుల విషవాయువుల తీవ్రత మూడు రోజుల పాటు కొనసాగడంతో.. దాదాపు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ప్రమాదంలో మృత్యువాతపడిన ఓ చిన్నారి ఫోటో ఇప్పటికీ ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తోంది. అందుకే ఇలాంటి అత్యంత భయంకరమైన పారిశ్రామిక దుర్ఘటనల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో.. వాటిని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. మీరు బయట ఉన్నప్పుడు మీకు ఏదైనా దుర్వాసన వాసన వస్తే వెంటనే ఎయిర్ ఫ్లో వచ్చే వ్యతిరేక దిశకు తిరిగి నిలబడండి.
  2. రెండు, మూడు కర్చీఫ్స్ తీసుకుని, మీ ముఖానికి ఒకటి డబుల్ ఫోల్డెడ్‌లో కట్టుకుని.. మరొక దాన్ని తడిపి.. మొదటి దానిపై టైట్‌గా మాస్క్ మాదిరిగా కట్టుకోండి.
  3. వీలైనంత తొందరగా దగ్గరలో ఉన్న ఇళ్లలోకి వెళ్లండి.
  4. గ్యాస్ లీకైన ప్రభావిత ప్రాంతంలో మీరు ఉన్నట్లయితే అనవసరంగా మాట్లాడకండి.
  5. మీరు బయట ఉన్నప్పుడు గానీ.. మీ కళ్లు మండుతున్నట్లు అనిపిస్తే.. వాటిని మీ చేతులతో రుద్దకోవద్దు.
  6. ఒకవేళ మీరు ఇంట్లో ఉంటే వెంటనే అన్ని తలుపులు, కిటికీలను మూసివేయండి. అంతేకాకుండా ఒక పొడవైన బెడ్ షీట్ తలుపుకు ఉంచి గాలి కూడా దూరనంతగా టైట్ చేయండి.
  7. ఇలాంటి సమయాల్లో కళ్లు ఖచ్చితంగా మండుతాయి. అందువల్ల వాటిని చల్ల నీటితో కడగండి.
  8. విపత్కర సమయాల్లో మనం భయపడకుండా.. గుండె నిబ్బరం చేసుకుని మనసును ప్రశాంతంగా ఉంచుకుని వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోవాలి.