ఫ్రెంచ్ ప్రైస్ వద్దు.. ఆపిల్స్, ద్రాక్షే ముద్దు..

Health Tips, ఫ్రెంచ్ ప్రైస్ వద్దు.. ఆపిల్స్, ద్రాక్షే ముద్దు..

నూడిల్స్, ఫ్రైడ్ రైస్ తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా దీనివల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందంటున్నారు. సాధారణంగా ఫ్రైంచ్ ఫ్రైస్‌ను హైడ్రోజెనేటెడ్ నూనెలతో అధిక ఉష్ణోగ్రత వద్ద తయారుచేయడం వల్ల, అవి కొవ్వు, ట్రాన్స్ కొవ్వు ధమనులను పాడుచేస్తాయి. ఇది ప్రధాన క్యాన్సర్ కారకమైన ఆహారం.

క్యాన్సర్‌కు కారణం అయ్యే ఒక ప్రధానమైన ఆహారాల్లో ఈ హైడ్రోజనేటడ్ ఆయిల్ కూడా ఒకటి. ఈ నూనెలను, తినే ఆహారాలు నిల్వచేయడానికి తయారు చేసే ఆహారాల తయారీ కోసం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఇటువంటి నూనెలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఇంట్లో కూడా వేపుళ్లకు వాడిన నూనెను, కాచిన నూనెను ఎక్కువసార్లు ఉపయోగించడం సరికాదు.

అలాగే కూల్ డ్రింక్స్, సోడాలో పంచదార, ఫుడ్ కెమికల్స్, కలర్స్ కలిసి వుంటాయి. సోడా శరీరంలో గ్యాస్ ఉత్పత్తికి కారణం అవుతుంది. ఇకపోతే.. ఆపిల్స్, ద్రాక్ష వంటి ఆరోగ్యకరమైన పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాని, రసాయనికంగా పండించిన పండ్లు క్యాన్సర్‌కు దారితీస్తాయి. కాబట్టి, సేంద్రీయ పద్ధతిలో పండించిన పండ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *