స్పీడు పెంచిన సిట్.. హానీ ట్రాప్ కేసులో కూపీ లాగుతున్న ఖాకీలు

మధ్యప్రదేశ్‌లో పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారును తమ గుప్పెట్లో పెట్టుకోవాలని విసిరిన వలపు వలలో చివరికి వారే చిక్కుకుని ఊచలు లెక్కబెడుతున్నారు. దేశంలో చర్చనీయాంశంగా మారిన హానీ ట్రాప్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న5 మహిళల్ని భోపాల్‌లో విచారిస్తున్నారు. దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన ఈ కేసులో ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. శనివారం విచారణకు హాజరైన ఐదుగురిలో ప్రధాన నిందితురాలు స్వేతా విజయ్ జైన్, శ్వేతా స్వప్నిల్ జైన్, బర్ఖా, ఆర్తీ […]

స్పీడు పెంచిన సిట్.. హానీ ట్రాప్ కేసులో  కూపీ లాగుతున్న ఖాకీలు
Follow us

| Edited By:

Updated on: Sep 29, 2019 | 4:49 AM

మధ్యప్రదేశ్‌లో పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారును తమ గుప్పెట్లో పెట్టుకోవాలని విసిరిన వలపు వలలో చివరికి వారే చిక్కుకుని ఊచలు లెక్కబెడుతున్నారు. దేశంలో చర్చనీయాంశంగా మారిన హానీ ట్రాప్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న5 మహిళల్ని భోపాల్‌లో విచారిస్తున్నారు. దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన ఈ కేసులో ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. శనివారం విచారణకు హాజరైన ఐదుగురిలో ప్రధాన నిందితురాలు స్వేతా విజయ్ జైన్, శ్వేతా స్వప్నిల్ జైన్, బర్ఖా, ఆర్తీ దయాళ్, మోనికా యాదవ్ ఉన్నారు. అత్యంత పటిష్ట బందోబస్తు మధ్య వీరిని విచారించేందుకు ఇండోర నుంచి భోపాల్‌కు తరలించారు.

పలువురు రాజకీయ నేతలు, ఉన్నతాధికారులను తమ అందం, ఆకర్షణతో వలలో వేసుకుని ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపణలు వీరిపై వెల్లువెత్తాయి. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించే విషయంలో భోపాల్, సాగర్, చింద్వారా, చాత్తార్‌పూర్‌దలతో పాటు ఢిల్లీకి కూడా వెళ్లనున్నారు. హానీట్రాప్ ముఠా వద్ద నుంచి ఇప్పటికే లాప్‌టాప్,పెన్‌డ్రైవ్ వంటి పలు ఎలక్ట్రానిక్ వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఉన్న డేటాను వెలికితీసి అందులో ఉన్న సమాచారాన్ని ఈ కేసుకు అనుసంధానించనున్నారు.

ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్వేతా విజయ్ జైన్, శ్వేతా స్వప్నాలీ జైన్, బర్ఖాలకు సెప్టెంబర్ 30 వరకు పోలీస్ రిమాండ్ విధించారు. మరో ఇద్దరు దయాళ్, యాదవ్‌లకు అక్టోబర్ 1 వరకు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేయడా వీరిలో ఐదుమంది మహిళలు కాగా ఒకరు మగవ్యక్తి. వీరంతా కలిసి పలువురు రాజకీయనేతలు, ఉన్నతాధికారులను టార్గెట్‌గా చేసుకుని బ్లాక్‌ మెయిల్ చేస్తున్నట్టుగా తేలింది.  ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌( ఐఎంసీ)లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో మొత్తం ఈ ముఠా చీకటి దందా బట్టబయలైంది.