అదరగొడుతున్న ‘హెల్‌బాయ్‌’ న్యూ ట్రైలర్

ఎర్రటి చర్మం.. చేతిలో గన్‌.. నోట్లో సిగార్‌.. కొమ్ములు కత్తిరించిన తల.. ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ ఇంట్రడక్షన్ అంతా హెల్‌బాయ్‌ గురించే అని. ఇప్పటికే రెండు సార్లు హాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన హెల్‌బాయ్‌ మరోసారి సందడి చేసేందుకు వస్తున్నాడు. ఇటీవల ‘హెల్‌బాయ్‌’ ట్రైలర్‌ను విడుదల చేసిన మూవీ యూనిట్.. ‘రెడ్‌ బ్యాండ్‌’ పేరుతో మరో ట్రైలర్‌ను అభిమానులతో పంచుకుంది. డార్క్‌ హార్స్‌ కామిక్స్ పాత్రల్లో ఒకటైన హెల్‌బాయ్‌కు క్రేజ్‌ ఎక్కువే. మానవజాతిని అంతం చేసి, తనదైన […]

అదరగొడుతున్న ‘హెల్‌బాయ్‌’ న్యూ ట్రైలర్
Follow us

|

Updated on: Mar 02, 2019 | 4:05 PM

ఎర్రటి చర్మం.. చేతిలో గన్‌.. నోట్లో సిగార్‌.. కొమ్ములు కత్తిరించిన తల.. ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ ఇంట్రడక్షన్ అంతా హెల్‌బాయ్‌ గురించే అని. ఇప్పటికే రెండు సార్లు హాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన హెల్‌బాయ్‌ మరోసారి సందడి చేసేందుకు వస్తున్నాడు. ఇటీవల ‘హెల్‌బాయ్‌’ ట్రైలర్‌ను విడుదల చేసిన మూవీ యూనిట్.. ‘రెడ్‌ బ్యాండ్‌’ పేరుతో మరో ట్రైలర్‌ను అభిమానులతో పంచుకుంది.

డార్క్‌ హార్స్‌ కామిక్స్ పాత్రల్లో ఒకటైన హెల్‌బాయ్‌కు క్రేజ్‌ ఎక్కువే. మానవజాతిని అంతం చేసి, తనదైన సామ్రాజ్యాన్ని సృష్టించుకోవాలని తాపత్రయపడే దుష్టశక్తులను హెల్‌బాయ్‌ ఏవిధంగా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర కథ. 1993లో విడుదలైన డార్క్‌ హార్స్‌ కామిక్స్‌ విశేష ప్రజాదరణ చూరగొంది. వెంటనే ఈ కామిక్స్‌పై హాలీవుడ్‌ దృష్టి పడటంతో గతంలో హెల్‌బాయ్‌(2004), హెల్‌బాయ్‌ 2: ది గోల్డెన్‌ ఆర్మీ(2008) చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వస్తోన్నది మూడో చిత్రం.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న తాజా చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందకు రానుంది. తాజా చిత్రానికి నెయిల్‌మార్షల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డేవిడ్‌ హార్బర్‌, మిల్లా జవోవిచ్‌, ఇయాన్‌ మెక్‌షానే, షషాలేన్‌, డేనియల్‌ డేకిమ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లయన్స్‌గేట్‌, మిలియన్‌ ఫిల్మ్స్‌, క్యాంప్‌బెల్‌ గ్రాబ్‌మెన్‌ ఫిల్మ్స్‌, డార్క్‌ హార్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాంకపై లారెన్స్‌ గోర్డాన్‌, లాయిడ్‌ లెవిన్‌, మైక్‌ రిచర్డ్‌సన్‌లు నిర్మిస్తున్నారు.

<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/ZsBO4b3tyZg” frameborder=”0″ allow=”accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>