మహారాష్ట్ర.. పీపీఈ కిట్లతో వచ్చి జువెల్లరీ షాపులో దోపిడీ

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఈక్విప్ మెంట్ (పీపీఈకిట్లు) కిట్లు ధరించిన దొంగలు ఓ జువెల్లరీ షాపులో దోపిడీకి పాల్పడ్డారు. మొత్తం 780  గ్రాముల బంగారాన్ని దోచుకుపోయారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ దోపిడీ తాలూకు..

మహారాష్ట్ర..  పీపీఈ కిట్లతో వచ్చి  జువెల్లరీ షాపులో దోపిడీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 07, 2020 | 2:06 PM

మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఈక్విప్ మెంట్ (పీపీఈకిట్లు) కిట్లు ధరించిన దొంగలు ఓ జువెల్లరీ షాపులో దోపిడీకి పాల్పడ్డారు. మొత్తం 780  గ్రాముల బంగారాన్ని దోచుకుపోయారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ దోపిడీ తాలూకు సీసీటీవీ ఫుటేజీ మంగళవారం వెలుగులోకి వచ్చింది. వీరు తలలకు క్యాప్ లు, ముఖాలకు మాస్కులు, చేతులకు గ్లోవ్స్ ధరించి పకడ్బందీగా షాపులోని షో కేసులు, కప్ బోర్డు నుంచి బంగారు నగలను దోచుకున్నారు. తమ షాపు గోడను పగులగొట్టి మొత్తం 78 తులాల పసిడిని చోరీ చేశారని షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈ చోరీపై ఖాకీలు దర్యాప్తు ప్రారంభించారు.  ఈ కరోనా కాలంలో దోపిడీ దొంగలు మరీ తెలివి మీరిపోతున్నారని ఆ యజమాని వాపోతున్నాడు.