ఈ నెల 21న తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు!

ఎడతెరిపిలేని వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంతడిసి ముద్దవుతోంది. కాగా.. ఈ నెల 21న తెలంగాణ‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమరంభీం

ఈ నెల 21న తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు!
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2020 | 9:12 PM

ఎడతెరిపిలేని వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంతడిసి ముద్దవుతోంది. కాగా.. ఈ నెల 21న తెలంగాణ‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్- గ్రామీణ, మ‌హ‌బూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో సుమారుగా ఆగస్టు 23 తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

Read More:

ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్‌ ఐసోలేషన్‌..!

జూరాలకు వరద ఉదృతి.. 39 గేట్లు ఎత్తివేత..!