కొనసాగుతున్న వరద.. నిండుకుండను తలపిస్తున్న ప్రాజెక్టులు..

కుండపోత వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండను తలపిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వానలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.

కొనసాగుతున్న వరద.. నిండుకుండను తలపిస్తున్న ప్రాజెక్టులు..
Follow us

|

Updated on: Oct 15, 2020 | 8:33 AM

కుండపోత వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండను తలపిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వానలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరద ఉధృతితో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. పలు ప్రాజెక్ట్‌లకు ఇన్‌ఫ్లో అత్యధికంగా వచ్చి చేరుతోంది. అటు వరద ప్రవాహం నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాగే, సుంకేశుల వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 61,240క్యూసెక్కులుగా, శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 3,91,416, ఔట్ ఫ్లో 4,11,885 క్యూసెక్కులుగా ఉంది. అటు, దిగువన ఉన్న నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,69,866 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,47,418 క్యూసెక్కులుగా కొనసాగుతుంది.

అలాగే, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7,49,807 క్యూసెక్కలుగా నమోదైంది. ఉత్తరాంధ్రలోని వంశధార నదికి వరద నీటి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో 55,540 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 56,750 క్యూసెక్కులుగా ఉంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయని.. జాగ్రత్తగా ఉండాలని.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చరించారు.

అటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండిపోయాయి. మూసీనది రికార్డుస్థాయిలో వరదనీటితో పొంగిపొర్లుతుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సింగూర్ ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ మట్టం 28.224 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీటి ఇన్ ఫ్లో 34,093 క్యూసెక్కులుగా

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!