తగ్గిన వర్షం.. గుంతల్లో బెజవాడ నగరం

Heavy rains lash Vijayawada.. roads damaged, తగ్గిన వర్షం.. గుంతల్లో బెజవాడ నగరం

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు.. జనజీవనం అస్తవ్యస్థమయ్యింది. ప్రస్తుతం పలుచోట్లు వర్షాలు తగ్గిన.. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి కారణం రోడ్లు.. పలు చోట్ల రహదారులపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలగడమే కాకుండా.. ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. బెజవాడలో ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టింది. కానీ రోడ్లపై గుంతలు మాత్రం జనాలని చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధాన రహదారిపై అడుగు మేర గుంతలు పడ్డాయి. ఇప్పటికే పలు ప్రమాదాలు కూడా జరిగాయి. అయినా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఆటోలు సైతం గుంతలో పడి ఇరుక్కుపోతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *