తమిళనాడు, పుదుచ్చేరిల్లో కురుస్తున్న భారీ వర్షాలు .. స్తంభించిన జ‌న జీవ‌నం.. రాక‌‌పోక‌ల‌కు తీవ్ర‌ అంత‌రాయం

త‌మిళ‌నాడులో ఏడు జిల్లాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న ప్ర‌క‌టించింది వాతావ‌ర‌ణ శాఖ‌. త‌మిళ‌నాడు, పుదుచ్చేరిలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.క‌న్యాకుమారి తీర ప్రాంతంలో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం....

తమిళనాడు, పుదుచ్చేరిల్లో కురుస్తున్న భారీ వర్షాలు .. స్తంభించిన జ‌న జీవ‌నం.. రాక‌‌పోక‌ల‌కు తీవ్ర‌ అంత‌రాయం
Follow us

|

Updated on: Dec 18, 2020 | 9:29 AM

త‌మిళ‌నాడులో ఏడు జిల్లాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న ప్ర‌క‌టించింది వాతావ‌ర‌ణ శాఖ‌. త‌మిళ‌నాడు, పుదుచ్చేరిలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.క‌న్యాకుమారి తీర ప్రాంతంలో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం కొన‌సాగుతోంది. పుదుచ్చేరిలో కురిసిన కుండ‌పోత వ‌ర్షాలతో ప‌లు ప్రాంతాలు నీట మునిగాయి. వ‌ర్షం కార‌ణంగా లోత‌ట్టు ప్రాంతాల‌లో భారీ వ‌ర్ష‌పు నీరు చేర‌డంతో ఇబ్బందులు త‌లెత్తాయి. వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అక్క‌డి అధికారులు స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. వ‌ర్షంతో ఎక్క‌డిక‌క్క‌డ భారీగా నీరు చేరి ప‌లు గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

ప‌లు ప్రాంతాలు సైతం జ‌ల‌దిగ్బంధంలో ఉండిపోయాయి. వ‌చ్చిపోయే వాహ‌నాల‌కు తీవ్ర ఇబ్బందులు త‌లెత్తాయి. ప‌లు గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోవ‌డం, వ‌ద‌ర నీరు భారీగా చేరి విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. కాగా, భారీ వ‌ర్షాల కార‌ణంగా ప్రభుత్వాలు అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశాయి. వ‌ర్షాల కారణంగా ప్ర‌మాదాలు జ‌రిగే అవ‌కాశాలుండ‌టంతో స‌హాయ‌క సిబ్బంది రంగంలోకి దిగాయి.

కాగా, మ‌రో 48 గంట‌ల పాటు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు. కాగా, ఇటీవ‌ల కూడా దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు అత‌లాకుత‌లం చేశాయి. తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ప‌శ్చిమ‌బెంగాల్ త‌దిత‌ర రాష్ట్రాల్లో భారీగా వ‌ర‌ద‌లు వ‌చ్చాయి. ఈ వ‌ర‌ద‌ల కార‌ణంగా తీవ్ర న‌ష్టం చ‌విచూశాయి. ఒక ద‌శ‌లో హైద‌రాబాద్ ను మాత్రం వ‌ణికించింది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..