పాలేరు వాగులో ఆర్టీసీ బస్సు..

Floods in Kurnool District, పాలేరు వాగులో ఆర్టీసీ బస్సు..
కర్నూలు జిల్లాను భారీ వర్షాలు, వరదలు ముంచేతెత్తున్నాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నంద్యాల, బనగానపల్లో నియోజకవర్గాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. మహానంది మండలంలోని తమడపల్లె గ్రామం వద్ద రాళ్లవాగు, గాజుల పల్లె సమీపంలోని పాలెరు వాగు పొంగిపొర్లుతుండడంతో నంద్యాల నుంచి మహానందికి రాకపోకలు పూర్తిగా అగిపోయాయి. మహానంది క్షేత్రంలో ఎన్నాడూ లేనంతగా రుద్ర గుండం కోనేరులోని పంచలింగాలు పూర్తి గా మునిగిపోయింది. మహానంది క్షేత్రం చుట్టూ నీరు ప్రవహిస్తోంది. మహానంది అగ్రికల్చరల్ కాలేజ్ వద్ద పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో కాలేజ్ లోనికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. కాలేజ్ లో గల గోశాలలోకి నీరు చేరడంతో గోవులను అక్కడి నుంచి తరలించారు. మహానంది పరిదిలోని ఈశ్వర్ నగర్, అబ్బిపురం,పుట్టుపల్లె గ్రామాలలో నీరు ఇండ్లలోకి చేరింది. నంద్యాల పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి రోడ్ల పైకి మురికి చేరింది. స్కూల్, కాలేజీలకు వెళ్ళడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుందూనది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో..కుందూ పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ‌ఉండాలని అధికారులు సూచించారు. నంద్యాల మండల పరిధిలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. అటు, కానాక చెరువు నిండుకుండలా మారింది. చెరువుకు కొన్ని చోట్ల నెర్రలు రావడంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బనగానపల్లె నియోజకవర్గంలోని వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి..ముదిగేడు గ్రామం వద్ద పాలేరు వాగు ఉప్పొంగి  ప్రవహిస్తోంది. అవుకు నుండి బొందలదీన్నే- కమలపూరి మీదుగా ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు.. కోయిలకుంట్ల సమీపంలో వాగులో చిక్కుకుంది. వాగు మధ్యలో బస్సు ఆగిపోవడంతో బస్సులోని వారంతా భయంతో కేకలు చేశారు. సమీప గ్రామంలోని ముదిగేడు కమాలపురి  గ్రామస్తులు బస్సు వద్దకు చేరుకొని తాళ్ళ సాయంతో ప్రయాణికులను రక్షించారు. సంజామల si నరేష్ బాబు తన  సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *